జడ్జి రామకృష్ణ అరెస్టు: పిన్నమ్మ మరణించాక ఫోర్జరీ చెక్కులతో...

By telugu teamFirst Published Dec 11, 2020, 6:51 PM IST
Highlights

జడ్జి రామకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. పలు వివాదాల్లో చిక్కుకున్న రామకృష్ణపై కెనరా బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు చేశారు. పిన్నమ్మ మరణించిన తర్వాత ఫోర్జరీ చెక్కులతో డబ్బులు తీసుకున్నాడని ఆయన ఆరోపించారు.

చిత్తూరు: న్యాయమూర్తి రామకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. రామకృష్ణపై మదనపల్లె పోలీసు స్టేషన్ లో కెనరా బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు చేశారు. రామకృష్ణ పిన్నమ్మ మరణించిన తర్వాత కూడా ఆమె పింఛన్ ను ఫోర్జరీ చెక్కుల ద్వారా డ్రా చేసుకున్నాడని బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదులో ఆరోపించారు.

ప్రస్తుతం రామకృష్ణ సస్పెన్షన్ లో ఉన్నారు. మదనపల్లె టూ టౌన్ పోలీసు స్టేషన్ లో ఆయను గంటల తరబడి పోలీసులు విచారిస్తున్నారు. ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేస్తున్నారు. విచారణ తర్వాత ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి కోర్టులో హాజరు పరుస్తారు. ఆయనపై 468, 420, 467 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

గతంలో న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దుండగులు దాడి చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అనుచరులే ఆ దాడి చేశారని రామకృష్ణ ఆరోపించారు. ఈ దాడిని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. దళిత సంఘాలు కూడా ఖండించాయి. అయితే, ఆ దాడితో తనకు ఏ సంబంధమూ లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు 

ఆ క్రమంలో రామకృష్ణ రోడ్డుపైకి రావద్దని తాహిసిల్దార్ ఆదేశాలు జారీ చేశారు. దాంతో రామకృష్ణ కోర్టును ఆశ్రయించారు తాహిసిల్దార్ ఇచ్చిన ఆదేశాలను కోర్టు కొట్టేసింది. 

గతంలో న్యాయమూర్తి రామకృష్ణ తమ్ముడు రామచంద్రను బీ కొత్తకోట పోలీసులు తీసుకుని వెళ్లారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణపై రామచంద్రను విచారణ నిమిత్తం తీసుకుని వెళ్లారు. 

click me!