ఇది ఆరంభమే... ఇకనుంచి పరిణామాలు మరింత తీవ్రం: చంద్రబాబుకు జోగి రమేష్ వార్నింగ్ (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Sep 17, 2021, 05:03 PM IST
ఇది ఆరంభమే... ఇకనుంచి పరిణామాలు మరింత తీవ్రం: చంద్రబాబుకు జోగి రమేష్ వార్నింగ్ (వీడియో)

సారాంశం

గూండాలను, సామాజికవర్గాన్ని అడ్డుపెట్టుకొని చంద్రబాబు ఇటువంటి లుచ్చా పనులు చేయటం సరైన పద్ధతి కాదంటూ వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ గట్టిగా హెచ్చరించారు.

మంగళగిరి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని అయ్యన్నపాత్రుడు విమర్శలు చేయడాన్ని ఖండిస్తూ ఒక సామాన్య పౌరుడిగా నిరసన తెలపడానికి తాడేపల్లి కరకట్ట వద్దకు వెళ్లినట్లు ఎమ్మెల్యే జోగి రమేష్ తెలిపారు. ఇలా శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళుతున్న తనతో పాటు వైసీపీ నాయకులపై చంద్రబాబు నాయుడు గూండాలు, అనుచరులు, ఆయన సామాజికవర్గం వాళ్లు రాళ్లతో దాడి చేయడం జరిగిందని రమేష్ వివరించారు. 

గూండాలను, సామాజికవర్గాన్ని అడ్డుపెట్టుకొని చంద్రబాబు ఇటువంటి లుచ్చా పనులు చేయటం సరైన పద్ధతి కాదంటూ హెచ్చరించారు. చంద్రబాబుకు ఇదే చివరిసారి చెప్పటం... ఇంకోసారి ఇటువంటి ఘటనగాని జరిగితే మేమేంటో చూపిస్తానంటూ ఎమ్మెల్యే రమేష్ హెచ్చరించారు. 

పిల్లనిచ్చిన సొంత మామనే రాళ్లు, చెప్పులతో కొట్టించి చరిత్ర చంద్రబాబుది... ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీని లాక్కొని ఆయనను అవమానించడమే కాకుండా దాడి చేయించిన ఘనత చంద్రబాబుకే దక్కిందని పెడన ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.  

వీడియో

''నువ్వు గుర్తుపెట్టుకో చంద్రబాబు... ఇది కేవలం ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో నువ్వు ఇలాంటివి చాలా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది జాగ్రత్త. బిసి, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వంటి వెనుకబడిన కులాలను ఆదుకొని అండగా నిలబడిన జగన్మోహన్ రెడ్డి మీద కుట్రపూరిత చర్యలతో ఇటువంటి పనులు చేస్తే ఊరుకునే ప్రసక్తి ఉండదు'' అంటూ తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు.
 
''చంద్రబాబు నాయుడికి మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నా... ఇటువంటి  పిచ్చి పనులు జరిగితే చంద్రబాబు నాయుడును చెంప చెల్లుమనిపించడం ఖాయం. ఇది కేవలం ఆరంభం మాత్రమే ఇకనుంచి జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి''  అని వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ హెచ్చరించారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్