అలాగే జరుగుతుంది: చంద్రబాబును తనిఖీ చేయడంపై జోగి రమేష్

By telugu teamFirst Published Jun 15, 2019, 2:03 PM IST
Highlights

న్నవరం విమానాశ్రయం నుంచి చంద్రబాబు వెళ్లడం ఇదే తొలిసారి కాదని, ఇది రెండోసారి అని జోగి రమేష్ శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తొలిసారి వెళ్లినప్పుడే అధికారులు నిబంధనల గురించి చంద్రబాబుకు చెప్పారని ఆయన అన్నారు.

విజయవాడ: ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని గన్నవరం విమానాశ్రయంలో తనిఖీ చేయడంపై వస్తున్న విమర్శలపై వైఎస్సార్ కాంగ్రెసు నేత జోగి రమేష్ స్పందించారు. జడ్ ప్లస్ కెటగిరీ ఏవియేషన్ లో చంద్రబాబుకు వర్తించదని ఆయన అన్నారు. గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబును తనిఖీ చేయడం అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. 

గన్నవరం విమానాశ్రయం నుంచి చంద్రబాబు వెళ్లడం ఇదే తొలిసారి కాదని, ఇది రెండోసారి అని జోగి రమేష్ శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తొలిసారి వెళ్లినప్పుడే అధికారులు నిబంధనల గురించి చంద్రబాబుకు చెప్పారని ఆయన అన్నారు. అద్వానీ, కరుణానిధి, ప్రఫుల్ కుమార్ మహంతాలకు మాత్రమే జడ్ ప్లస్ కెటగిరీ భద్రత ఏవియేషన్ లో వర్తిస్తుందని, మిగతావారెవరికీ వర్తించదని ఆయన వివరించారు. తాము ఎయిర్ పోర్ట్ అథారిటీతో మాట్లాడామని, వారు నిబంధనల గురించి స్పష్టంగా చెప్పారని ఆయన అన్నారు. 

తమ పార్టీ మీద, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తే ఎవరూ నమ్మే పరిస్థితి లేదని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపి 23 స్థానాలు మాత్రమే గెలుచుకుందని వచ్చే ఎన్నికల్లో 23 మంది గెలుస్తారో లేదోనని ఆయన అన్నారు. చంద్రబాబు హత్యలు, కులరాజకీయాలు చేశారనే విమర్శలు వస్తున్నాయని ఆయన అన్నారు.  ప్రజలు చంద్రబాబు చెంప చెల్లుమనిపించే తీర్పు ఇచ్చారని, అయినా కూడా పద్ధతి మార్చుకోవడం లేదని అన్నారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో పాటు ఆ పార్టీ నాయకులకు చింత చచ్చినా ఇంకా పులుపు చావలేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితమయినా టీడీపీ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదని ఆయన విమర్శించారు. చంద్రబాబు బండారం ప్రజలకు తెలిసింది కాబట్టే టీడీపీని బొందపెట్టారన్నారు. 

click me!