డిప్యూటీ సిఎం పుష్ప శ్రీవాణికి తప్పిన ప్రమాదం

Published : Jun 15, 2019, 10:49 AM ISTUpdated : Jun 15, 2019, 11:20 AM IST
డిప్యూటీ సిఎం పుష్ప శ్రీవాణికి తప్పిన ప్రమాదం

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆమె అధిరోహించిన సభా వేదిక కూలడంతో ప్రమాదం సంభవించింది. అయితే, ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు.

విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆమె అధిరోహించిన సభా వేదిక కూలడంతో ప్రమాదం సంభవించింది. అయితే, ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు.

ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఆమె జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా రాజపులోవాలో స్వాగత సభ ఏర్పాటైంది. సభా వేదిక మీదికి పెద్ద యెత్తున కార్యకర్తలు చేరుకోవడంతో వేదిక ఓ వైపు ఒరిగింది. టెంట్ కూలిపోయింది. ఈ సమయంలో భద్రతా సిబ్బంది పుష్పశ్రీవాణిని జాగ్రత్తగా కిందికి దింపారు. దీంతో ప్రమాదం తప్పింది.

PREV
click me!

Recommended Stories

Sri Sathya Sai University: దేశంలోనే తొలిసారి 138 మంది రైతులకు ‘కృషి - ఋషి’ పట్టాలు.. హిస్టరీ క్రియేట్ శ్రీ సత్యసాయి యూనివర్శిటీ
IMD Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఏయే జిల్లాల్లో అంటే?