సంతృప్తిగా లేను: కేంద్రంపై జేసీ సంచలన వ్యాఖ్యలు

By pratap reddyFirst Published Aug 11, 2018, 8:06 AM IST
Highlights

కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎంపీగా సంతృప్తిగా లేనని ఆయన అన్నారు. ఒక ఎంపీగా నిర్వహించాల్సిన బాధ్యత పట్ల తనకు ఏ విధమైన సంతృప్తి లేదని అన్నారు.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎంపీగా సంతృప్తిగా లేనని ఆయన అన్నారు. ఒక ఎంపీగా నిర్వహించాల్సిన బాధ్యత పట్ల తనకు ఏ విధమైన సంతృప్తి లేదని అన్నారు.

ప్రజా విషయాలేమీ సభ ముందుకు తేలేకపోతున్మానని, అస్తమానం నిరసనకే సమయమంతా సరిపోయిందని ఆయన శుక్రవారంనాడు అన్నారు. కేంద్ర ప్రభుత్వంపైన ఒక్క టీడీపీ నుంచే కాదు.. ప్రతీ పార్టీ నుంచి రోజూ  నిరసన వస్తోందని అన్నారు.
 
నరేంద్ర మోదీ నిరంకుశం.. మూర్ఖత్వం ఉన్న మనిషి అని అన్నారు. ఏదైనా చెప్తే అర్థం చేసుకునే వ్యక్తి కారని అన్నారు. మోడీతో పాటు మిగతా మంత్రులు కూడా యధా రాజా తధా ప్రజా అన్నట్లుగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా రైల్వే, ఆర్థిక మంత్రులు మరింత నిరంకుశంగా ఉన్నారని తప్పు పట్టారు. 

నరేంద్ర మోదీ నాయకత్వం కింద తమ రాష్ట్రం ఏమీ సాధించలేదని అన్నారు. ఎన్నికల తర్వాత సమీకరణాలు మారతాయని, బలం తగ్గినా అతిపెద్ద పార్టీ బీజేపీనే అవతరించవచ్చునని అన్నారు. 

కాంగ్రెస్ ఇంకా బలాన్ని పుంజుకోవాల్సి ఉందని అన్నారు. ఏపీలో 25 లోక్‌సభ స్థానాలు టీడీపీకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

click me!