
టీడీపీ (tdp) సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (jc prabhakar reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీమంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డిపై (palle raghunatha reddy) ఆయన విమర్శలు గుప్పించారు. సైకం శ్రీనివాస్‌రెడ్డిని టీడీపీ కార్యకర్తలకు ప్రభాకర్‌రెడ్డి పరిచయం చేశారు. ఈ పరిచయ కార్యక్రమంలో శ్రీనివాస్‌రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తూ.. పల్లె రఘునాథ్‌రెడ్డిపై జేసీ మండిపడ్డారు. శ్రీనివాస్‌రెడ్డి మచ్చలేని నాయకుడని కొనియాడారు. పల్లె రఘునాథ్‌రెడ్డికి టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడిపోతాడని జోస్యం చెప్పారు. ఆయనకు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా టీడీపీ గెలుస్తుందని ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. కొత్త ముఖాలకు టికెట్ కేటాయించాలని.. తన కుమారుడి కంటే మంచివ్యక్తికి టికెట్ ఇచ్చినా సపోర్ట్ చేస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు.
ఇకపోతే.. గత నెలలోనూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమపై కక్ష సాధింపులు వద్దని.. అలా చేసి ఏం సాధిస్తారని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. ‘తెలంగాణ ప్రభుత్వం film industryకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇదేవిధంగా ప్రోత్సహిస్తే అక్కడ సినీ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుంది. కక్ష సాధింపు చర్యలు వల్ల andhra pradeshలో సినీపరిశ్రమకు మనుగడ లేకుండా పోతుంది. అంతే కానీ సినీ నటులకు ఎలాంటి నష్టం ఉండదు. ఎమ్మార్వోలు, పోలీసులు.. అంతా కలిసి Movie theatersపై పడ్డారు.
లా అండ్ ఆర్డర్ ను పోలీసులు మర్చిపోయారు. జనసేన అధినేత Pawan Kalyan నటించిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్వయంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలోని సదుపాయాలను సినిమా వాళ్లు వినియోగించుకోవాలని కోరారు. కేటీఆర్ హాజరవడంతో పవన్ కళ్యాణ్ కు ప్రజల్లో మరింత మంచి పేరు వచ్చింది. ప్రతి ఒక్కరికీ ఈగో ఉంటుంది. స్వతంత్రంగా కష్టపడి పైకి వచ్చిన పవన్ కళ్యాణ్ లాంటి వారికి ఇంకా ఎక్కువగానే ఉంటుంది.
అయితే అన్ని సందర్భాల్లో ఇది పని చేయదు సినీ పరిశ్రమను నాశనం చేయొద్దు. ఇది రాష్ట్ర మనుగడకు మంచిది కాదు. ఏదైనా ఉంటే ప్రత్యక్ష చర్యలు తీసుకోవాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యువకుడు. సత్తా ఉన్నవారు. సినీ పరిశ్రమ విషయంలో ఇప్పటికైనా సీఎం జగన్ తన వ్యవహార శైలిని మార్చుకోవాలి’ అని జేసీ ప్రభాకర్ రెడ్డి కోరారు.