మున్సిపల్ ఛైర్మన్‌గా నన్ను తొలగించలేరు: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Jul 25, 2021, 02:26 PM IST
మున్సిపల్ ఛైర్మన్‌గా నన్ను తొలగించలేరు: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

మున్సిపల్ ఛైర్మన్‌గా తనను తొలగించలేరని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 27న ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ధర్నా చేస్తానని ఆయన వెల్లడించారు. పోలీసులు లా అండర్ ఆర్డర్ పాటించడం లేదని జేసీ ఆరోపించారు. 

టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దారెడ్డి ఇది బలవంతుడి రాజ్యం అనిపించుకోవాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఆర్డీడీ కాలనీలో 85 అక్రమ ఇళ్లు తొలగిస్తుంటే తాము సహకరించామని తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్‌గా తనను తొలగించలేరని ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 27న ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ధర్నా చేస్తానని ఆయన వెల్లడించారు. పోలీసులు లా అండర్ ఆర్డర్ పాటించడం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. 

PREV
click me!

Recommended Stories

Hero Ghattamaneni Jayakrishna Speech: జై బాబు.. బాబాయ్ కి నేను పెద్ద ఫ్యాన్ | Asianet News Telugu
Deputy CM Pawan Kalyan: కాకినాడ పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం | Asianet Telugu