మహిళా కలెక్టర్ తో జేసీ ప్రభాకర్ రెడ్డి దురుసు ప్రవర్తన.. కాగితాలు విసిరేసి, బీకేర్ ఫుల్ అంటూ బెదిరించి..

Published : Nov 07, 2022, 02:05 PM IST
మహిళా కలెక్టర్ తో జేసీ ప్రభాకర్ రెడ్డి దురుసు ప్రవర్తన.. కాగితాలు విసిరేసి, బీకేర్ ఫుల్ అంటూ బెదిరించి..

సారాంశం

టీడీపీ జేసీ ప్రభాకర్ రెడ్డి తన దురుసు ప్రవర్తనతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఏకంగా కలెక్టర్ మీదే విరుచుపడ్డారు. దీంతో ఈ అంశం వివాదాస్పదంగా మారింది. 

అనంతపురం : టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి రౌడీయిజం ప్రదర్శించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి.. కలెక్టర్ హాల్ లో ఏకంగా కలెక్టర్ పైనే విరుచుపడ్డారు. కలెక్టర్ నాగలక్ష్మి ఎదుట పేపర్లు విసిరేసి దురుసుగా ప్రవర్తించారు. నువ్వు కలెక్టర్ గా పనికిరావు అంటూ మహిళా అధికారిని అవమానించారు. బీకేర్ ఫుల్ అంటూ కలెక్టర్ కే వార్నింగ్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అయితే, తాడిపత్రిలో ఓ భూవివాదం గురించి జేసీ ప్రభాకర్ రెడ్డి.. సోమవారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. 

ఈ సందర్భంగా రెవెన్యూ భవన్ లో కలెక్టర్ ను జేసీ కలిశారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రెడ్డి ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయారు. కలెక్టర్ ను బెదిరిస్తున్న క్రమంలో గన్ మెన్, ప్రభాకర్ రెడ్డిని వారించే ప్రయత్నం చేసినా ఆయన వినలేదు. గన్ మెన్ ను వెనక్కి నెట్టివేశారు. ఈ క్రమంలో మహిళా కలెక్టర్ అని కూడా చూడకుండా బీకేర్ ఫుల్ అంటూ ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా బయటకు వచ్చి మీడియాతో కూడా ఆయన దురుసుగా మాట్లాడినట్లు తెలుస్తోంది. 

సజ్జల దిన్నె గ్రామంలోని భూములకు చాలా విలువ ఏర్పడింది. ఈ భూమలను కొంతమంది భూకబ్జాదారులు ఆక్రమించుకుంటున్నారు. దాన్ని ప్రభుత్వంఎందుకు పట్టించుకోవడం లేదని కలెక్టర్ మీద విరుచుకుపడ్డారు. మాజీ ఎమ్మెల్యే నైన నన్నే బయటికి వెళ్లమంటావా అంటూ ఆమెతో గొడవపడ్డాడు. దీనిమీద ఏం యాక్షన్ తీసుకుంటున్నావ్.. ఈ స్పందన ఎందుకు అంటూ మండిపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం
అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu