కొనసాగుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన: తాడిపత్రి మున్సిపల్ ఆఫీస్ వద్ద ఆందోళన

By narsimha lode  |  First Published Apr 25, 2023, 9:34 AM IST

 తాడిపత్రి మున్సిపల్ అభివృద్దికి  కమిషనర్ సహకరించడం లేదని  ఆరోపిస్తూ   మున్సిపల్ కార్యాలయం వద్ద  జేసీ ప్రభాకర్ రెడ్డి  నిరసనకు దిగారు.  


తాడిపత్రి:  టీడీపీకి  చెందిన మున్సిపల్ కౌన్సిలర్లకు  కమిషనర్ సహకరించడం లేదని మున్సిపల్ కార్యాలయం వద్దే   చైర్ పర్సన్  జేసీ ప్రభాకర్ రెడ్డి  నిరసనకు దిగారు.  సోమవారంనాటి నుండి  జేసీ ప్రభాకర్ రెడ్డి  తన నిరసనను కొనసాగిస్తున్నారు.  సోమవారంనాడు  రాత్రి  మున్సిపల్ కార్యాలయం వద్దే జేసీ ప్రభాకర్ రెడ్డి  నిద్రించారు.  మంగళవారంనాడు  ఉదయం మున్సిపల్ కార్యాలయం వద్దే  బ్రష్  చేసుకున్నారు.  అక్కడే  స్నానం చేశారు.  తాడిపత్రి మున్సిపల్ అభివృద్దికి  కమిషనర్ అడ్డుపడుతున్నాడని  జేసీ ప్రభాకర్ రెడ్డి  ఆరోపిస్తున్నారు. ఇవాళ  కూడా  మున్సిపల్ కార్యాలయం వద్ద  నిరసనను కొనసాగించనున్నారు.  

 తాడిపత్రి అభివృద్దికి  ప్రభుత్వం  నిధులు  అందించడం లేదని  కూడా  జేసీ ప్రభాకర్ రెడ్డి  గతంలో కూడా ఆరోపణలు చేశారు.   తాడిపత్రి అభివృద్ది  విషయమై  జేసీ ప్రభాకర్ రెడ్డి  నిరసనకు దిగిన  విషయం తెలిసిందే.  

Latest Videos

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలుపొందిన ఏకైక  మున్సిపాలిటీ  తాడిపత్రి.  తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గానికి గతంలో  జేసీ  ప్రభాకర్ రెడ్డి,  జేసీ దివాకర్ రెడ్డిలు  ప్రాతినిథ్యం వహించారు.  2019  ఎన్నికల  సమయంలో  తాడిపత్రి  అసెంబ్లీ  స్థానం నుండి  జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుబుడ జేసీ ఆస్మిత్ రెడ్డి  టీడీపీ అభ్యర్ధిగా  పోటీ చేసి  ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత  జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో  జేసీ  ప్రభాకర్ రెడ్డి  బరిలోకి దిగారు. మున్సిపాలిటీ పరిధిలో  వైసీపీ కంటే  టీడీపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. తాడిపత్రి  మున్సిపల్ చైర్ పర్సన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి  ఎన్నికయ్యారు

click me!