జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో వైఎస్ షర్మిల భేటీ .. రాజకీయ వర్గాల్లో ఆసక్తి

By Siva KodatiFirst Published Jan 17, 2024, 8:40 PM IST
Highlights

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కలిశారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి హాజరుకావాల్సిందిగా కోరుతూ ఆహ్వానపత్రికను పవన్‌కు అందజేశారు. అలాగే ఏపీ పీసీసీ చీఫ్‌గా నియమితులైనందుకు గాను షర్మిలను పవన్ కళ్యాణ్ అభినందించారు. 
 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కలిశారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి హాజరుకావాల్సిందిగా కోరుతూ ఆహ్వానపత్రికను పవన్‌కు అందజేశారు. అలాగే ఏపీ పీసీసీ చీఫ్‌గా నియమితులైనందుకు గాను షర్మిలను పవన్ కళ్యాణ్ అభినందించారు. 

కాగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  అసెంబ్లీలను లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తుంది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది.  కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి  ఎన్నికైన ఎంపీలు కీలక పాత్ర పోషించిన  సందర్భాలు కూడ లేకపోలేదు. 

Latest Videos

2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజననతో  కాంగ్రెస్ పార్టీ  ఉనికిని కోల్పోయింది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత  2023 నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఎన్నికలకు  కొన్ని రోజుల ముందు జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కూడ కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కూడ  కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్ లో  ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో  ఈ ఎన్నికల్లో   కనీసం  15 శాతం  ఓట్లను సాధించాలని  కాంగ్రెస్ పార్టీ టార్గెట్ పెట్టుకుంది.  ఈ దిశగా  ఆ పార్టీ  వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. 

ఈ నెల  4వ తేదీన  వైఎస్ఆర్‌టీపీ అధినేత వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన పార్టీ వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వై.ఎస్. షర్మిల కీలక పాత్ర పోషించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. రాష్ట్రంలో  తన బలాన్ని పెంచుకోవడానికి  వై.ఎస్. షర్మిల దోహదపడుతుందని  కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. వైఎస్ఆర్‌సీపీ పార్టీలోని అసంతృప్తులకు  కాంగ్రెస్ పార్టీ  గాలం వేస్తుందనే  ప్రచారం సాగుతుంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి  కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ప్రకటించారు.  

మరో వైపు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి  వైఎస్ఆర్‌సీపీ రాజీనామా చేశారు.  కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రఘువీరారెడ్డితో  ఇటీవల సమావేశమయ్యారు. కాపు రామచంద్రారెడ్డి  కాంగ్రెస్ లో చేరుతారనే  ప్రచారం కూడ సాగుతుంది. కళ్యాణదుర్గం నుండి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని కాపు రామచంద్రారెడ్డి ప్రకటించారు. రాయదుర్గం నుండి తన ఆప్తులు పోటీ చేస్తారని  ఆయన  ప్రకటించారు. గెలుపు గుర్రాలకే  టిక్కెట్లు కేటాయించాలనే ఉద్దేశ్యంతో  సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను వైఎస్ఆర్‌సీపీ మారుస్తుంది. అయితే టిక్కెట్టు దక్కని నేతలు  ప్రత్యామ్నాయమార్గాలను వెతుక్కుంటున్నారు.  ఈ క్రమంలోనే  వైఎస్ఆర్‌సీపీ అసంతృప్తులపై  కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. 
 

click me!