
అమరావతి : పల్నాడు జిల్లా రెంటచింతలలో జరిగిన road accident అత్యంత బాధాకరమని జనసేన అధినేత pawan kalyan అన్నారు. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారని తెలిసి విచారానికి లోనయ్యాను అని తెలిపారు. srisailamలో దర్శనానికి వెళ్లి వస్తున్న వీరంతా మృత్యువాతపడటం అత్యంత బాధాకరమని ఆవేదన చెందారు. ఆ కుటుంబాలకు జనసేనాని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వ్యవసాయ కూలీ పనులపై ఆధారపడి జీవించే ఆ కుటుంబాల వారిని ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో గాయాల పాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలి అని పవన్ కల్యాణ్ తెలిపారు.
కాగా, family membersతో వారంతా శివుడి దర్శనం చేసుకున్నారు. దేవుని దర్శనం పూర్తికావడంతో వారంతా happyగా తిరుగు ప్రయాణమయ్యారు. తమ ఊరి సరిహద్దుల్లోకి చేరుకున్నారు. కొన్ని నిమిషాల్లో వారి ఇంటి వద్ద దిగి పోవడానికి సిద్ధమవుతున్నారు. ఇంతలో పెద్ద శబ్దం వచ్చింది. దొర్లుకుంటూ రోడ్డు మీద పడ్డారు. ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి. నెత్తురోడుతూ హాహాకారాలు.. చిమ్మ చీకట్లో రక్షించండి.. అని ఆర్తనాదాలు.. ఆదివారం అర్ధరాత్రి Rentacintala రహదారి ఈ భయానక సంఘటనలకు సాక్ష్యంగా నిలిచింది.
రెంటచింతల బీసీ కాలనీకి చెందిన వారంతా సరుకు రవాణా చేసే టాటా ఏస్ వాహనంతో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. శ్రీశైలం నుంచి తిరిగి వస్తున్న వీరి వాహనం రెంటచింతల పొలిమేరలోకి రాగానే స్థానిక విద్యుత్ ఉపకేంద్రం వద్ద ఆగి ఉన్న లారీని వెనకనుంచి బలంగా ఢీకొట్టింది. వాహనం పల్టీలు కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా ఒకరిపై ఒకరు పడటంతో ఆర్తనాదాలు చేశారు.
ప్రమాదానికి కారణం అదే..
మాచర్ల నుంచి రెంటచింతలకు ప్రవేశించే మొదట్లో గోలివాగు కాలువ ప్రవహిస్తుంది. ఇక్కడ స్నానాలు చేసేందుకు వాహనాలు ఆపుతుంటారు. ఇక్కడ అంతా చీకటిగా ఉండటంతో దగ్గరకు వచ్చే వరకు అక్కడే ఆగి ఉన్న వాహనాలు కనిపించవు. దీంతో రహదారిపై ప్రయాణం చేసే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. కానీ వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్న వాహన డ్రైవర్ నిత్యం తిరిగే రహదారి అనే నిర్లక్ష్యంతో వేగంగా దూసుకెళ్ళాడు. రహదారిపై ఆగి ఉన్న లారీని గమనించకపోవడంతో ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే.. క్షతగాత్రులను 108లో గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలో నలుగురు చనిపోగా, తీవ్ర గాయాలైన మరో ఇద్దరు గురజాల ఆస్పత్రిలో చనిపోయారు. క్షతగాత్రులు అందరిని గుంటూరు సర్వజనాస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.