తడిసి ముద్దవుతున్న ఏపీ... రేపు మరో అల్పపీడనం, బిక్కుబిక్కుమంటున్న జనం

Siva Kodati |  
Published : Nov 28, 2021, 06:43 PM IST
తడిసి ముద్దవుతున్న ఏపీ... రేపు మరో అల్పపీడనం, బిక్కుబిక్కుమంటున్న జనం

సారాంశం

భారీ వర్షాలతో (heavy rains) ఆంధ్రప్రదేశ్ (ap rains) తడిసి ముద్ధవుతోంది. నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో నిన్నటి నుంచి వాన పడుతోంది. ఇక రేపు అండమాన్‌లో అల్పపీడనం (depression) ఏర్పడే అవకాశం వుంది. 48 గంటల తర్వాత అది మరింత బలపడనుందని వాతావరణ శాఖ (imd) హెచ్చరించింది.

భారీ వర్షాలతో (heavy rains) ఆంధ్రప్రదేశ్ (ap rains) తడిసి ముద్ధవుతోంది. నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో నిన్నటి నుంచి వాన పడుతోంది. ఇక రేపు అండమాన్‌లో అల్పపీడనం (depression) ఏర్పడే అవకాశం వుంది. 48 గంటల తర్వాత అది మరింత బలపడనుందని వాతావరణ శాఖ (imd) హెచ్చరించింది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. అయితే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో 7 సెంటిమీటర్ల నుంచి 20 సెంటిమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం వుందని హెచ్చరించింది. 

అలాగే గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురవచ్చని తెలిపింది. ఇక తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం వుందని డిసెంబర్ 1 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా రేపు చిత్తూరు, కడప జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్లు. ఏపీకి వచ్చే 24 గంటల్లో మూడు జిల్లాల్లో భారీ నుంచి , అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హెచ్చరించింది. 

మరోవైపు విస్తారంగా కురుస్తున్న వర్షాలతో అనంతపురం జిల్లాలో (anantpur district) పెన్నా నది (pennar river) మహోగ్రరూపం దాల్చింది. పెన్నా నదికి ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. దాంతో జిల్లాలో పెన్నా నదిపై ఉన్న అన్ని డ్యాముల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీనిలో భాగంగా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 1000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. 

Also Read:ఎడతెరిపి లేకుండా వర్షం: పెన్నా మహోగ్రరూపం, అనంత జిల్లాలో ఆనకట్టల గేట్ల ఎత్తివేత

వరద గేట్ల నుంచి నీటిని విడుదల చేయడం డ్యామ్ చరిత్రలో ఇదే తొలిసారి. అప్పర్ పెన్నా, మిడ్ పెన్నా, చాగల్లు రిజర్వాయర్ల గేట్లు కూడా ఎత్తివేశారు. అటు, కండలేరు జలాశయంలోనూ (kandaleru reservoir) నీటి మట్టం పెరుగుతుండడంతో తెలుగు గంగ కాలువ (telugu ganga canal) నుంచి నీటి విడుదలకు అధికారులు రెడీ అయ్యారు. స్వర్ణముఖి నదికి కూడా నీటిని విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. వరద ప్రవాహం నేపథ్యంలో తొట్టంబేడు మండలం రాంభట్లపల్లి గ్రామస్తులను అధికారులు అప్రమత్తం చేశారు. 

కాగా.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. ఆత్మకూరుతో పాటుగా ఉదయగిరి, వెంకటగిరి నియోజకవర్గాల్లో కూడా రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల కురిసన వర్షాలకే వాగులు, వంకలు పొంగి ప్రవహించిన సంగతి  తెలిసిందే. తాజాగా మరోసారి వర్ష బీభత్సం నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  

PREV
click me!

Recommended Stories

Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి
IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!