Badvel bypoll: బద్వేల్ ఉపఎన్నిక బరి నుంచి జనసేన ఔట్.. పవన్ కీలక ప్రకటన, కారణమిదే

Siva Kodati |  
Published : Oct 02, 2021, 08:58 PM ISTUpdated : Oct 02, 2021, 09:03 PM IST
Badvel bypoll: బద్వేల్ ఉపఎన్నిక బరి నుంచి జనసేన ఔట్.. పవన్ కీలక ప్రకటన, కారణమిదే

సారాంశం

బద్వేల్ ఉపఎన్నికలో జనసేన పోటీ చేయదన్నారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. చనిపోయిన వ్యక్తి సతీమణిని గౌరవిస్తూ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఎన్నికల్లో పోటీచేయమని ఒత్తిడి వచ్చిందని పవన్ తెలిపారు. ఏకగ్రీవం చేసుకోవాలని ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేశారు. 

కాగా, బద్వేల్ అసెంబ్లీ స్థానానికి (Badvel bypoll) జరిగే ఉప ఎన్నికల్లో ఏ పార్టీ పోటీ చేయాలనే దానిపై  బీజేపీ (bjp), జనసేనల(jana sena) మధ్య తొలుత ఏకాభిప్రాయం కుదరలేదు. అయితే ఈ స్థానం నుండి ఈ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్ధి బరిలోకి దిగుతారని బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు (somu veerraju)ప్రకటించారు.

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ (pawan kalyan), జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్(nadendla manohar), బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజులు గురువారంనాడు బద్వేల్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీపై చర్చించారు. తిరుపతి పార్లమెంట్ (tirupati ) ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసింది. దీంతో బద్వేల్ ఉప ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని తొలుత బీజేపీ నేతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ప్రచారం సాగింది. తాజాగా పవన్ ప్రకటనతో బీజేపీ-జనసేనలు బద్వేల్ ఉపఎన్నిక బరిలో లేవని తేలిపోయింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు