ప్రభుత్వోద్యోగాల పేరిట మోసం...మంత్రి, మేయర్ కలిసి మూడు కోట్ల దోపిడీ: జనసేన అధికార ప్రతినిధి సంచలనం

By Arun Kumar PFirst Published Jun 25, 2021, 1:48 PM IST
Highlights

విజయవాడ కార్పొరేషన్లో 150పోస్టులు ఖాళీగా వున్నాయని... వాటిని ఇప్పిస్తామని నిరుద్యోగ యువత నుండి మంత్రి వెల్లంపల్లి, మేయర్ భాగ్యలక్ష్మి దాదాపు మూడు కోట్లు దోచుకున్నారంటూ జనసేన నాయకులు పోతిన వెంకట మహేష్ సంచలన ఆరోపణలు చేశారు. 
 

విజయవాడ: ప్రభుత్వ శాఖలో ఉద్యోగాల పేరిట మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మీ నిరుద్యోగల నుండి కోట్ల రూపాయలు వసూలు చేశారని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆరోపించారు. విజయవాడ కార్పొరేషన్లో 150పోస్టులు ఖాళీగా వున్నాయని... వాటిని ఇప్పిస్తామని దాదాపు మూడు కోట్లు దోచుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. 

''ఉద్యోగాల పేరిట మంత్రి వెల్లంపల్లి, మేయర్ భాగ్యలక్ష్మి ఒక్కొక్కరి నుంచి రెండు లక్షలు వసూలు చేశారు. మంత్రి,మేయర్ కి సవాల్ చేస్తున్నా... మూడు కోట్లు పుచ్చుకున్న ఆధారాలను కూడా త్వరలో బయట పెడతా'' అనిహెచ్చరించారు.

read more  ఉరితాడుతో, నిలువ కాళ్ల మీద నిలబడ్డ ఎమ్మెల్యే రామానాయుడు.. ఎందుకంటే...

''అయినా నోటిఫికేషన్ లేకుండా కార్పొరేషన్ ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు. సంబంధిత మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించి ఈ వ్యవహారంపై విచారణ చేయించాలి... తప్పు చేసిప వారిపై చర్యలు తీసుకోవాలి'' అని డిమాండ్ చేశారు.

''మేయర్ పదవిని పొందిన మూడు నెలల్లోనే కియా కారు కొన్నారు భాగ్యలక్ష్మి. అంత డబ్బు ఆమెకు ఎలా వచ్చాయి. వెల్లంపల్లి అవినీతిపై సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి స్పందించాలి. చర్యలు తీసుకోకపోతే వారికి కూడా ముడుపులు ముడుతున్నాయని భావించాల్సి వుంటుంది. ప్రభుత్వ పెద్దల అండతోనే వెల్లంపల్లి అవినీతి చేస్తున్నారనేది మా నమ్మకం. ప్రభుత్వం స్పందించకపోతే న్యాయస్థానం ద్వారా పోరాటం చేస్తాం'' అని వెంకట మహేష్ హెచ్చరించారు. 

click me!