ఏపీలో రాబోయేది జనసేన-టీడీపీ ఉమ్మడి ప్రభుత్వమే..: నాగబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై  జనసేన నేత, నటుడు నాగబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వ్యవస్థలను, అధికారులను మేనేజ్ చేయడంలో సీఎం వైఎస్ జగన్ జగన్ దిట్ట అని ఆరోపించారు. 

Google News Follow Us

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై  జనసేన నేత, నటుడు నాగబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వ్యవస్థలను, అధికారులను మేనేజ్ చేయడంలో సీఎం వైఎస్ జగన్ జగన్ దిట్ట అని ఆరోపించారు. జగన్ మాటలు విని అధికారులు తప్పులు చేస్తే.. భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పినట్టుగా అధికారులకు 6 నెలలు సమయం ఇస్తున్నామని.. ఈలోగా పద్దతి  మార్చుకోవాలని అన్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి జనసేన కార్యవర్గ సమావేశంలో నాగబాబు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. ఏపీలో రౌడీయిజం, గుండాయిజం పెరిపోయిందని, కంటికి కనిపించిన భూములను వైసీపీ నాయకులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. వారు చేస్తున్న దౌర్జన్యాలపై ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. అక్రమ కేసులు పెట్టి  అరెస్ట్‌లు చేస్తున్నారని అన్నారు. వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే రాష్ట్రం అథోగతి పాలైందని విమర్శించారు. మరోసారి జగన్‌కు ఛాన్స్ ఇస్తే ప్రజల ఆస్తులను బలవతంగా లాక్కుంటారని అన్నారు. జనసేన, టీడీపీ కలిసి పని చేస్తేనే వైసీపీ దౌర్జన్య పాలనకు అంతం పలుకుతామని చెప్పారు. 

జగన్ దుర్మార్గ, దౌర్జన్య పాలనను అంతమొందించాలంటే క్షేత్రస్థాయిలో జనసేన శ్రేణులు.. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పనిచేయాలని కోరారు. పొత్తులకు తూట్లు పొడిచేలా ఎవరూ ఎక్కడా మాట్లాడొద్దని  జనసేన శ్రేణులకు సూచించారు. పవన్ కల్యాణ్ నిర్ణయానికి కట్టుబడి ఉండటం అందరి బాధ్యత అని.. పదేళ్లు ఎదురుచూశామని, మరికొన్ని రోజులు క్రమశిక్షణగా పనిచేస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతామని చెప్పారు. రాష్ట్రంలో రాబోయేది జనసేన-టీడీపీ ఉమ్మడి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడి, నిస్వార్దంగా పనిచేసే ప్రతి కార్యకర్తకు మంచి  భవిష్యత్తు ఉంటుందని నాగబాబు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. 

Read more Articles on