జగన్ పెద్దగా చదువుకోలేదు.. అందుకే ఎవరి మాటా వినడు , జీవో నెం. 1 ఎందుకంటే : నాగబాబు వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jan 12, 2023, 2:46 PM IST
Highlights

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నత విద్యావంతుడు కాడని, అందువల్ల ఎవరు చెప్పినా వినరని వ్యాఖ్యానించారు జనసేన నేత నాగబాబు. ప్రజాస్వామ్యాన్ని పాతరేసేందుకే పాత చట్టం తీసుకొచ్చారని.. రాష్ట్రంలో పౌరహక్కుల్ని హరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మండిపడ్డారు జనసేన నేత నాగబాబు. శ్రీకాకుళంలో జరుగుతున్న యువశక్తి సభలో ఆయన మాట్లాడుతూ.. వారాహి యాత్రను అడ్డుకునేందుకే జీవో నెంబర్ 1ని తీసుకొచ్చారని నాగబాబు ఆరోపించారు. జగన్ ఉన్నత విద్యావంతుడని ఎవరు చెప్పినా వినరని ఆయన దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని పాతరేసేందుకే పాత చట్టం తీసుకొచ్చారని.. రాష్ట్రంలో పౌరహక్కుల్ని హరిస్తున్నారని నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్, సీఐడీ వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉద్యోగులు , ఉపాధ్యాయులపై నిఘా పెడుతున్నారని నాగబాబు వ్యాఖ్యానించారు. ఏపీలో ఇసుక మాఫియా పెరిగిపోయిందని ఆయన ఆరోపించారు. 

ఇకపోతే.. బుధవారం నాగబాబు మాట్లాడుతూ.. ఒక్క సినిమాకు కోట్లాది రూపాయలు తీసుకునే పవన్‌కు ప్యాకేజ్ అవసరమా అని ప్రశ్నించారు. తమకు ప్యాకేజ్ ఎవరిచ్చారంటూ ఘాటుగా విమర్శించారు. రామ్‌గోపాల్ వర్మ అవసరం కోసం ఎంత నీచానికైనా దిగజారుతారని , అతనోక వెధవ అంటూ నాగబాబు విమర్శించారు. కాపు కులాన్ని తాకట్టు పెట్టే హక్కు తమకు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నేతల తాతలు వచ్చి పవన్ కల్యాణ్‌కు ప్యాకేజ్ ఇచ్చారా అని నాగబాబు నిలదీశారు.

ALso REad: ఆర్జీవీ ఒక వెధవ.. పవన్‌కు కోట్లలో రెమ్యునరేషన్, ప్యాకేజ్ ఎందుకు : వైసీపీ నేతలకు నాగబాబు కౌంటర్

యువతీ యువకులు తమ అభిప్రాయాన్ని ధైర్యంగా తెలియజేయగలిగేలా జనసేన పార్టీ క్రియేట్ చేయగలిగిందన్నారు. ఇప్పటి వరకు యువత ఆలోచనలు, అభిప్రాయాలు సోషల్ మీడియా వరకే పరిమితమయ్యాయని నాగబాబు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో వాళ్లు గళం విప్పబోతున్నారని.. రాష్ట్ర అభివృద్ధికి వారిచ్చే సూచనలు రేపు తెలుస్తాయని ఆయన అన్నారు. అన్ని సమస్యలతో పాటు యువతకు దిశానిర్దేశం చేసే ఆలోచనలు పవన్ వద్ద వున్నాయని నాగబాబు పేర్కొన్నారు. 

click me!