రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియడం లేదని నాగబాబు పేర్కొన్నారు. సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలు అర్థం కావడం లేదని విమర్శించారు. జగన్ కంటే చంద్రబాబు పాలనే నయమని... అప్పుడు కనీసం ఎం జరుగుతుందో తెలిసేదని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు విమర్శలు చేస్తారు. ఈ క్రమంలో చంద్రబాబుపై ప్రశంసలు కురిపించడం గమనార్హం. జగన్ తో పోలిస్తే... చంద్రబాబు చాలా నయమంటూ పేర్కొనడం విశేషం.
పూర్తి వివరాల్లోకి వెళితే... ఇటీవల నాగబాబు జంగారెడ్డి గూడెంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాన్ని.. ఈ ప్రభుత్వాన్ని పోలుస్తూ జగన్ కి చురకలు వేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియడం లేదని నాగబాబు పేర్కొన్నారు. సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలు అర్థం కావడం లేదని విమర్శించారు. జగన్ కంటే చంద్రబాబు పాలనే నయమని... అప్పుడు కనీసం ఎం జరుగుతుందో తెలిసేదని పేర్కొన్నారు.
Also Read మూడు రాజధానులు: జగన్ పై విరుచుకుపడ్డ ఆర్ఎస్ఎస్...
ఇక ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో జనసేన పొత్తు రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని చెప్పారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే జనసేన, బీజేపీ పొత్తు సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పాడాలని నాగబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ బీజేపీతో జతకట్టారని... రాష్ట్ర ప్రజల కోసం నిబద్ధతతో పనిచేస్తున్నారని నాగబాబు తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం ఏం చేస్తున్నారో క్లారిటీ ఉండేదని.. కానీ ఈ సీఎం హయాంలో ఎం జరుగుతుందో కనీసం అంతు చిక్కడం లేదని చెప్పారు.