పాఠశాలల్లో కోవిడ్ విజృంభణ.. గుంటూరు జిల్లాలో పది మందికి పాజిటివ్

Siva Kodati |  
Published : Sep 04, 2021, 06:57 PM IST
పాఠశాలల్లో కోవిడ్ విజృంభణ.. గుంటూరు జిల్లాలో పది మందికి పాజిటివ్

సారాంశం

గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో కరోనా కలకలం రేపింది. బాపట్ల నియోజకవర్గంలోని రెండు ప్రభుత్వ పాఠశాలల్లో పది మంది కరోనా బారినపడ్డారు. కరోనా నేపథ్యంలో గురు పూజోత్సవాలను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది

గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో కరోనా కలకలం రేపింది. బాపట్ల నియోజకవర్గంలోని రెండు ప్రభుత్వ పాఠశాలల్లో పది మంది కరోనా బారినపడ్డారు. వీటిలో పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నలుగురు విద్యార్థులకు, ఒక ఉపాధ్యాయురాలికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్థరణ అయ్యింది. అలాగే బాపట్ల మండలం నరసాయపాలెం గ్రామంలోని బాలయోగి గురుకుల బాలికల పాఠశాలలో ఐదుగురు విద్యార్థినులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.

వారిలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు నలుగురు, తొమ్మిదో తరగతి విద్యార్థిని ఒకరు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా నిర్థారణా పరీక్షలు నిర్వహించారు. పాఠశాల మొత్తాన్ని శుభ్రం చేసి రసాయనాన్ని స్ప్రే చేశారు . మరోవైపు కరోనా నేపథ్యంలో గురు పూజోత్సవాలను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. గురుపూజోత్సవం, ఉపాధ్యాయ అవార్డుల ప్రధానోత్సవాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 
 

PREV
click me!

Recommended Stories

Tirumala : వైకుంఠ ద్వారం గుండా శ్రీవారి అభిషేక దర్శనం.. మీకూ ఈ అదృష్టం దక్కాలంటే ఏం చేయాలో తెలుసా?
IMD Cold Wave Alert : చలి నుండి ఉపశమనం మూన్నాళ్ల ముచ్చటే.. మళ్లీ గజగజలాడించే చలి, పొగమంచు ఎక్స్ట్రా