ఇంద్రకీలాద్రి దుర్గగుడి అమ్మవారి ఆలయంలో ఏసీబీ అధికారుల సోదాల్లో శుక్రవారం నాడు కీలక మలుపు చోటు చేసుకొంది. అమ్మవారి ఆలయంలో అక్రమాలపై ఆధారాలు ఇవ్వాలని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ ను ఏసీబీ అధికారులు కోరారు.
విజయవాడ: ఇంద్రకీలాద్రి దుర్గగుడి అమ్మవారి ఆలయంలో ఏసీబీ అధికారుల సోదాల్లో శుక్రవారం నాడు కీలక మలుపు చోటు చేసుకొంది. అమ్మవారి ఆలయంలో అక్రమాలపై ఆధారాలు ఇవ్వాలని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ ను ఏసీబీ అధికారులు కోరారు.
ఏసీబీ అధికారుల పిలుపు మేరకు జనసేన అధికార ప్రతినిధి మహేష్ దుర్గగుడిలో అక్రమాలపై ఏసీబీ అధికారులకు ఆధారాలను అందించారు. రెండు రోజులుగా దుర్గగుడిలో అక్రమాలపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
undefined
also read:బెజవాడ కనకదుర్గ ఆలయంలో రెండో రోజూ కొనసాగుతున్న ఏసీబీ సోదాలు
ఇవాళ రెండో రోజున కూడ సోదాలు కొనసాగాయి. తొలి రోజు సోదాల్లో అమ్మవారికి సమర్పించిన చీరలను దేవాలయ సిబ్బంది కొందరు కొట్టేస్తున్నారనే విషయం తేలింది.
ఈ విషయాలపై ఇవాళ కూడ ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఆలయంలో సుధీర్ఘంగా పనిచేస్తున్న వారెవరూ అనే విషయమై కూడ ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.దుర్గగుడి రథానికి చెందిన వెండి విగ్రహాలు చోరీకి గురయ్యాయి. నిందితుడిని పోలీసులు ఇటీవలనే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.