ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు కీలక ఉత్తర్వులు ఇచ్చింది.
అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు కీలక ఉత్తర్వులు ఇచ్చింది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై విచారణ జరిపే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేదని దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు విచారణ చేసింది.
ఏకగ్రీవంగా ఎన్నికైన స్థానాల్లో ఫామ్-10 ఇస్తే ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది హైకోర్టు. ఫామ్ ఇవ్వని చోట ఫలితాలను నిలిపివేయాలని ఎన్నికల సంఘాన్ని కోరింది హైకోర్టు. ఈ నెల 23వ తేదీ వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది.
హైకోర్టు ఉత్తర్వులు మాత్రం ప్రభుత్వ వర్గాల్లో ఉత్సాహన్ని నింపేలా ఉన్నాయి. గతంలో జరిగిన ఎన్నికలను రద్దు చేస్తూ కొత్త షెడ్యూల్ విడుదల చేస్తే ఊరుకోబోమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఏపీలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు చోటు చేసుకొన్న విషయం తెలిసిందే.