సంస్కారం ఉండాలి.. జగన్ కి జనసేన కౌంటర్

First Published Jul 25, 2018, 2:17 PM IST
Highlights

 రాజకీయాల్లో ఉన్నాక.. విమర్శలు చేయడం తప్పదని, కానీ.. వ్యక్తిగతంగా, కుటుంబ గురించి మాట్లాడడం మంచిది కాదన్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను జనసేన తప్పుపట్టింది. పవన్ కళ్యాణ్.. కారు మార్చినట్టుగా భార్యలను మారుస్తాడంటూ జనగ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మాదాసు గంగాధరం మండిపడ్డారు.

పవన్‌పై జగన్ చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం హుందాగా లేవని గంగాధరం అన్నారు. రాజకీయాల్లో ఉన్నాక.. విమర్శలు చేయడం తప్పదని, కానీ.. వ్యక్తిగతంగా, కుటుంబ గురించి మాట్లాడడం మంచిది కాదన్నారు.
 
‘‘రాజకీయాల్లో సంస్కారం ఉండాలి. అది ముఖ్యం. సంకుచిత ధోరణితో మాట్లాడే ప్రతిపక్ష నేత మనకు ఉండడం బాధాకరం. మా అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గారు.. ఎప్పుడు కూడా.. ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించరు. వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించకూడదని జనసేన సిద్ధాంతాల్లో ఉంది. మా అధ్యక్షుడు జనసైనికులందరికీ సంస్కారం నేర్పించారు. విధానపరమైన తప్పిదాలు ఉంటేనే మేము విమర్శిస్తాం తప్ప.. వ్యక్తిగతంగా ఎవరిపైనా విమర్శలు చేయము.
 
జగన్ ఒక అపరిపక్వమైన రాజకీయ నేత. ఆయనకు పరిపక్వత రావాలని, అసహనం తగ్గాలని, ఆయనన నోట మంచి మాటలు రావాలని అందరూ దేవుణ్ని ప్రార్థిద్దాం. అంతకంటే చేయగల శక్తి కూడా మన దగ్గర లేదు.’’ అంటూ జగన్ వ్యాఖ్యలకు మాదాసు గంగాధరం కౌంటర్ ఇచ్చారు.

click me!