మేం గెలిచిన రోజున దమ్ముంటే .. మీ ఇళ్లల్లో వుండండి : వైసీపీ నేతలకు పవన్ వార్నింగ్

Siva Kodati |  
Published : Oct 05, 2023, 07:51 PM IST
మేం గెలిచిన రోజున దమ్ముంటే .. మీ ఇళ్లల్లో వుండండి : వైసీపీ నేతలకు పవన్ వార్నింగ్

సారాంశం

ఏ పోలీసులతో కేసులు పెట్టించారో, అదే పోలీసులతో మక్కెలిరిగేలా చేస్తామని వైసీపీ నేతలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. మీరు భయపడ్డారంటే.. మీరు బలహీనపడ్డట్లేనని వైసీపీకి ఆయన చురకలంటించారు.

నేను ఎన్డీయే కూటమిలో వుంటే ఎంత.. లేకపోతే ఎంత అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వారాహి విజయయాత్రలో భాగంగా కృష్ణాజిల్లా ముదినేపల్లిలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తానంటే వైసీపీ నేతలకు ఎందుకంత భయం అంటూ చురకలంటించారు. 2014లో బీజేపీ, టీడీపీ అధికారంలోకి రాకుండా వుంటే జనసేన పరిస్ధితి ఏంటో అర్ధం చేసుకోండి అని పవన్ ప్రశ్నించారు. 2014లో మోడీ, చంద్రబాబుకు మద్ధతు ఇచ్చి ఛాన్స్ తీసుకున్నామని ఆయన అన్నారు. 

వైఎస్సార్‌ను ఎదిరించి కూడా తాను ఎక్కడికి పారిపోలేదని.. ఎవరెవరిపై ఏ కేసులు పెట్టారో కూడా అన్నీ గుర్తున్నాయని పవన్ దుయ్యబట్టారు. ఢిల్లికీ వెళ్లారు కదా.. తెలంగాణతో పాటు ఎన్నికలంటే మరో నెలన్నర రోజులే మీరు అధికారంలో వుండేదని జనసేనాని పేర్కొన్నారు. మేము గెలిచిన రోజున.. దమ్ముంటే మీ ఇళ్లల్లో, మీ ఆఫీసుల్లో వుండండి అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రజల్ని కులాలపరంగా విడగొడితే చూస్తూ కూర్చేనే పార్టీ జనసేన కాదన్నారు. వారసత్వ రాజకీయాలపట్ల తనకు ఇబ్బందేమి లేదని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు భయపడ్డారంటే.. మీరు బలహీనపడ్డట్లేనని వైసీపీకి ఆయన చురకలంటించారు. ఏ పోలీసులతో కేసులు పెట్టించారో, అదే పోలీసులతో మక్కెలిరిగేలా చేస్తామని పవన్ హెచ్చరించారు. 

కైకలూరులో ఒక వంతెన కూడా నిర్మించలేకపోయారని.. వంతెనకు 80 శాతం ఖర్చు చేసినా ఇప్పటికీ పూర్తి కాలేదని పవన్ దుయ్యబట్టారు. అంచెలంచెలుగా ప్రజల జీవితాలను గుప్పిట్లో పెట్టుకుంటున్నారని.. వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన కలిస్తే వైసీపీ భయపడాల్సిన అవసరం లేదని.. మొత్తం 175 సీట్లు వైసీపీకే వస్తాయని చెబుతున్నారంటూ పవన్ చురకలంటించారు. మొత్తం సీట్లు మీకు వస్తే టీడీపీ, జనసేనలకు భయపడనక్కర్లేదన్నారు. 

మీరు అద్భుతంగా పాలిస్తే వచ్చే ఎన్నికల్లో గెలవాలని పవన్ సవాల్ విసిరారు. భయపడుతున్నారంటే మాకు బలం వుందని ఒప్పుకున్నట్లేనని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. జనసేనకు 150 ఎమ్మెల్యే, 30 ఎంపీ సీట్లు వుంటే విపక్షాల ఊసే ఎత్తనని ఆయన స్పష్టం చేశారు. ఖచ్చితంగా వైసీపీ భవిష్యత్తు తేలుస్తామని పవన్ హెచ్చరించారు. నాపై దాడి చేయడానికి నా కార్యాలయం చుట్టూ మోహరించారని.. జనసేన, టీడీపీ అధికారంలోకి రాగానే పెంచిన మద్యం ధరలు తగ్గిస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మద్యం మొత్తం నిషేధిస్తానని అబద్ధపు మాటలు చెప్పనని ఆయన దుయ్యబట్టారు. మహిళలు ముందుకొచ్చి అడిగినచోట మద్యం నిషేధిస్తామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సర్పంచ్‌లు మద్య నిషేధం కోరితే అదనపు నిధులిస్తామని ఆయన తెలిపారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu