శాంతి భద్రతల గురించి ఆలోచిస్తున్నా ... మీరు మారతారా, నన్నే రోడ్డెక్కమంటారా : ఏపీ పోలీసులకు పవన్ అల్టీమేటం

Siva Kodati |  
Published : Sep 03, 2022, 04:05 PM IST
శాంతి భద్రతల గురించి ఆలోచిస్తున్నా ... మీరు మారతారా, నన్నే రోడ్డెక్కమంటారా : ఏపీ పోలీసులకు పవన్ అల్టీమేటం

సారాంశం

ఏపీ పోలీసుల తీరు మారకుంటే తానే రోడ్డెక్కుతానని హెచ్చరించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. విజయవాడలో జనసేన జెండా దిమ్మె ధ్వంసం ఘటనపై ఆయన స్పందించారు. పోతిన మహేశ్‌ను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నానని పవన్ తెలిపారు  

విజయవాడలో జనసేన జెండా దిమ్మె ధ్వంసం ఘటనపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. పోలీసుల తీరు మారకుంటే తానే రోడ్డెక్కుతానని ఆయన హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదనే సంయమనం పాటిస్తున్నానని పవన్ స్పష్టం చేశారు. జెండా దిమ్మెలు పగులగొట్టిన వైసీపీ నేతలపై కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని జనసేనాని ప్రశ్నించారు. పోతిన మహేశ్‌ను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నానని పవన్ తెలిపారు. జగ్గయ్యపేటలోనూ జనసేన జెండా ఆవిష్కరణ కోసం జనసేన నాయకులపై కేసులు పెట్టడం ఎంత వరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. 

దీనిపై పోలీస్ అధికారులు ఆలోచించాలని.. ఇది పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలకడంగానే భావిస్తున్నామని పవన్ అన్నారు. అధికార పార్టీ అన్ని కార్యక్రమాలను ముందస్తు అనుమతితోనే చేస్తోందా అని ఆయన ప్రశ్నించారు. అన్నింటికీ అనుమతులు వున్నాయని పోలీసులు ప్రకటించగలరా అని పవన్ కల్యాణ్ నిలదీశారు. అనుమతులు లేకపోతే వాటిని తొలగిస్తారా అని ఆయన ప్రశ్నించారు. పోలీసులు ధర్మాన్ని పాటించాలని.. దీనిపై పోలీస్ అధికారులు ఆలోచించాలని పవన్ కల్యాణ్ హితవు పలికారు. జనసేన ఉనికిని తీసిపారేయడం ఎవరి తరం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలే పార్టీని కాపాడుకుంటారని పవన్ కల్యాణ్ తెలిపారు. 

Also Read:నక్సలైట్ అవుదామనుకుని.. హీరోగా, జనసేనానిగా... పవన్ కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

కాగా... జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని శుక్రవారం విజయవాడ వన్ టౌన్‌లోని రాయల్ హోటల్ సెంటర్ వద్ద వున్న జనసేన పార్టీ జెండా దిమ్మెకి శ్రేణులు రంగులేసి ముస్తాబు చేశారు. అయితే సదరు దిమ్మె తమ పార్టీదంటూ వైసీపీ నేతలు కార్యక్రమానికి అడ్డుతగిలారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు జనసేన కార్యకర్తలను నెట్టివేయడం వివాదాస్పదమైంది. సమాచారం అందుకున్న నగరానికి చెందిన జనసేన నేత పోతిన మహేశ్ పోలీసులతో వాదనకు దిగారు. ఈ క్రమంలో ఆయనను అదుపులోకి తీసుకుని భవానీపురం పీఎస్‌కు తరలించారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్