పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి బ్రేక్...

By Arun Kumar PFirst Published Apr 6, 2019, 9:04 AM IST
Highlights

 ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న తరుణంలో జనసేనకు షాక్ తగిలింది. ఆ పార్టీ అభ్యర్ధుల తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న అధ్యక్షులు పవన్ కల్యాణ్ ప్రచారానికి శనివారం బ్రేక్ పడింది. శుక్రవారం అస్వస్ధతకు గురైన పవన్ కోలుకోకపోవడం...డాక్టర్లు విశ్రాంతి సూచించడంతో ఆయన ప్రచార కార్యక్రమాలన్ని రద్దయినట్లు జనసేన పార్టీ తెలిపింది. 
 
శుక్రవారం విజయనగరం జిల్లా పర్యటనలో పవన్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. విపరీతమైన ఎండ కారణంగా అతడు వడదెబ్బకు గురయ్యారు. విజయనగరం పర్యటనలో డీహైడ్రేషన్ కు లోనై నీరసించిపోయిన అతడు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోగానే టెలిమెడిసిన్‌ సెంటర్‌లో చికిత్స తీసుకున్నారు. 

 ఎయిర్‌పోర్ట్ నుండి పవన్ కల్యాణ్ నేరుగా ఇంటికి వెళ్లకుండా మెరుగైన వైద్యం కోసం ఆయుష్‌ ఆస్పత్రిలో చేరారు. అక్కడ డాక్టర్లు పవన్ కు చికిత్స అందించి రాత్రి డిశ్చార్జ్ చేశారు. డాక్టర్ల విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో  పవన్ తన ప్రచార కార్యక్రమాలను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. 

ఎన్నికల సభలు నిర్ణీత సమయాని కంటే ఎక్కువ సమయం గడపడం, వేళకు భోజనం చేయకపోవడం తదితర కారణాలతో పవన్ కళ్యాణ్‌కు షుగర్ లెవల్స్ తగ్గిపోయినట్టుగా చెబుతున్నారు. అలాగే ఎండను సైతం లెక్కచేయకుండా రోడ్ షోలు, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ పవన్ అస్వస్థతకు గురయ్యారు. 

click me!