చంద్రబాబుకి ఊరట.. పసుపు-కుంకుమకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Published : Apr 05, 2019, 03:45 PM IST
చంద్రబాబుకి ఊరట.. పసుపు-కుంకుమకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

సారాంశం

ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఊరట కలిగించింది. టీడీపీ ప్రభుత్వం తరపున రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ పేరిట రూ.పదివేలు ఇస్తున్న సంగతి తెలిసిందే.  


ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఊరట కలిగించింది. టీడీపీ ప్రభుత్వం తరపున రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ పేరిట రూ.పదివేలు ఇస్తున్న సంగతి తెలిసిందే.  అదేవిధంగా అన్నదాత సుఖీభవ, పెన్షన్లు కూడా అందజేస్తోంది.

అయితే... ఈ పథకాలు ఎన్నికలను ప్రభావం చేస్తాయని వైసీపీ నేతలు ఆరోపించారు. జనచైతన్య వేదిక అనే సంస్థ  దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కాగా..దీనిపై కోర్టు టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది.

పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ, పెన్షన్లు పంపిణీ చేయొచ్చని హైకోర్టు స్పష్టంచేసింది. పాత పథకాలే కావడంతో నగదు పంపిణీ నిలిపివేయాల్సిన అవసరంలేదని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను ప్రభుత్వ తరుపు లాయర్ కోర్టులో అందజేశారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Speech: తిరుపతి వెడ్డింగ్ హబ్ గా తయారవుతుంది | Wedding Hub | Asianet News Telugu
Chandrababu: స్వర్ణ నారావారిపల్లెకు శ్రీకారం చుట్టాం.. జీవనప్రమాణాలు పెంచాలి | Asianet News Telugu