తిరుపతి బైపోల్: ఈ నెల 21న తిరుపతికి పవన్ కళ్యాణ్

By narsimha lodeFirst Published Jan 15, 2021, 4:47 PM IST
Highlights

ఈ నెల 21వ తేదీన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తిరుపతిలో పర్యటించనున్నారు. త్వరలో తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.దీంతో పవన్ కళ్యాణ్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
 

అమరావతి: ఈ నెల 21వ తేదీన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తిరుపతిలో పర్యటించనున్నారు. త్వరలో తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.దీంతో పవన్ కళ్యాణ్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

గత ఏడాదిలో అనారోగ్యంతో  తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణించాడు. దీంతో తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది.

తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధిని బరిలోకి దింపాలని జనసేన భావిస్తోంది. బీజేపీ కూడ ఈ స్థానం నుండి పోటీకి సై అంటోంది. అయితే ఈ స్థానం నుండి బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధి బరిలో దింపుతామని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు.

also read:తిరుపతిలో చావో రేవో: విజయానికి ఐదంచెల వ్యూహాంతో టీడీపీ

2019 ఎన్నికల సమయంలో తిరుపతి ఎంపీ స్థానం నుండి బీఎస్పీకి జనసేన మద్దతును ప్రకటించింది. ఆ ఎన్నికల సమయంలో బీజేపీ కంటే బీఎస్పీ అభ్యర్ధికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో ఈ స్థానం నుండి తమ పార్టీ అభ్యర్ధికే పోటీ చేసే అవకాశం కల్పించాలని జనసేన  డిమాండ్ చేస్తోంది.

ఈ నెల 21వ తేదీన పవన్ కళ్యాణ్ తిరుపతిలో పర్యటించనున్నారు. తిరుపతిలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో పవన్ తో పాటు రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహార్ కూడ పాల్గొంటారని ఆయన చెప్పారు. 

తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నిక  షెడ్యూల్ విడుదలయ్యే సమయంలో పవన్ కళ్యాణ్ తిరుపతి టూర్ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతారనేది ప్రస్తుతం ఆసక్తి నెలకొంది

click me!