ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: మొత్తం 8,85,710కి చేరిక

Published : Jan 15, 2021, 03:31 PM IST
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: మొత్తం 8,85,710కి చేరిక

సారాంశం

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 094 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 85వేల 710 కి చేరుకొన్నాయి. 

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 094 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 85వేల 710 కి చేరుకొన్నాయి. గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ఒక్కరు మరణించారు. కరోనాతో కృష్ణ జిల్లాలో ఒక్కరు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,139కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,25,14,639 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 31,696 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 232 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో 232 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 76వేల 372 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 2,199 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లోఅనంతపురంలో001, చిత్తూరులో 010,తూర్పుగోదావరిలో 015, గుంటూరులో 014, కడపలో 013, కృష్ణాలో 012, కర్నూల్ లో 001, నెల్లూరులో 001, ప్రకాశంలో 002, శ్రీకాకుళంలో 005, విశాఖపట్టణంలో 012, విజయనగరంలో 003,పశ్చిమగోదావరిలో 005 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -67,550, మరణాలు 597
చిత్తూరు  -86,709,మరణాలు 846
తూర్పుగోదావరి -1,24,042, మరణాలు 636
గుంటూరు  -75,257, మరణాలు 668
కడప  -55,156, మరణాలు 462
కృష్ణా  -48,297,మరణాలు 676
కర్నూల్  -60,715, మరణాలు 487
నెల్లూరు -62,248,మరణాలు 506
ప్రకాశం -62,109, మరణాలు 580
శ్రీకాకుళం -46,047, మరణాలు 347
విశాఖపట్టణం  -59,497, మరణాలు 557
విజయనగరం  -41,100, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,088, మరణాలు 539


 

 

PREV
click me!

Recommended Stories

Sajjala Ramakrishna REddy Pressmeet: మీ ఆటలు సాగవు సజ్జల స్ట్రాంగ్ వార్నింగ్| Asianet News Telugu
Chief Justice of India Justice Surya Kant Visits Tirumala: తిరుమల శ్రీవారి సేవలో జస్టిస్ సూర్యకాంత్