అమలు చేయలేని హామీలు ఎందుకు ఇవ్వడం: జగన్ పై పవన్ కళ్యాణ్

By Nagaraju penumalaFirst Published Jul 31, 2019, 7:54 PM IST
Highlights

అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే బాధేస్తోందని పవన్ అన్నారు. అసెంబ్లీలో నాయకులు కొట్టుకోవడం ఒక్కటే తక్కువ  అని విమర్శించారు. ఒకరిని మరోకరు వేలెత్తి చూపించుకుని మరీ విమర్శించే స్థాయికి దిగజారిపోయిందన్నారు. 
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. అమలుకు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. 


పింఛను ఏటా రూ.250 పెంచుతామని ముందే చెప్పాల్సింది అని కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత చెప్పడం సరికాదన్నారు. అమలుచేయలేని హామీలు ఇవ్వడం ఎందుకని పవన్‌ కళ్యాణ్ ప్రశ్నించారు.  

మరోవైపు మద్యపాన నిషేధం ముఖ్యమంత్రి జగన్​తో సాధ్యం కాదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. జగన్ మద్యపాన నిషేధం అమలు జరగదన్నారు. అయితే మహిళలు ఆందోళన చేసే చోట్ల మద్యం దుకాణాలు ఎత్తివేయాలంటూ సూచించారు. 

ఇకపోతే తిత్లీ తుఫాను సమయంలో శ్రీకాకుళం జిల్లాలో వైయస్ జగన్ ఎవరినైనా పలకరించారా కనీసం పరామర్శించారా అంటూ నిలదీశారు. అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే బాధేస్తోందని పవన్ అన్నారు. అసెంబ్లీలో నాయకులు కొట్టుకోవడం ఒక్కటే తక్కువ
 అని విమర్శించారు. 

ఒకరిని మరోకరు వేలెత్తి చూపించుకుని మరీ విమర్శించే స్థాయికి దిగజారిపోయిందన్నారు. ఏదో ఒకరోజు దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా చేస్తానని పవన్‌  స్పష్టం చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏ పొరపాట్లు జరిగాయో వాటిని గుర్తించి సరిచేసుకుంటామన్నారు. సమర్థత లేని నాయకుల వల్లే గత ఎన్నికల్లో ఓడిపోయామని వాటిని అధిగమించి తీరుతామన్నారు పవన్ కళ్యాణ్. 

ఈ వార్తలు కూడా చదవండి

పవన్ కళ్యాణ్ ఒక బ్రహ్మాస్త్రం, లోకల్ బాణంలా వాడొద్దు: నాగబాబు

తలలు, బుగ్గలు నిమరలేను.. ఎన్టీఆర్‌లా నా పక్కన ఎవరూ లేరు: పవన్ వ్యాఖ్యలు

click me!