ఏపీ: 24 గంటల్లో 168 మందికి పాజిటివ్.. 20,68,011కి చేరిన సంఖ్య, చిత్తూరులో అత్యధికం

Siva Kodati |  
Published : Nov 19, 2021, 07:36 PM IST
ఏపీ: 24 గంటల్లో 168 మందికి పాజిటివ్.. 20,68,011కి చేరిన సంఖ్య, చిత్తూరులో అత్యధికం

సారాంశం

ఏపీలో కొత్తగా 168 కరోనా కేసులు (corona cases in ap) నమోదవ్వగా.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 301 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,425 మంది చికిత్స పొందుతున్నారు

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) గడిచిన 24 గంటల్లో 168 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,68,011కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,425కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల కృష్ణా, చిత్తూరు జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 301మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,51,161కు చేరింది. గత 24 గంటల వ్యవధిలో 31,040 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,01,28,928కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,425 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 9, చిత్తూరు 35, తూర్పుగోదావరి 19, గుంటూరు 20, కడప 3, కృష్ణ 26, కర్నూలు 0, నెల్లూరు 13, ప్రకాశం 2, శ్రీకాకుళం 9, విశాఖపట్నం 22, విజయనగరం 2, పశ్చిమ గోదావరిలలో 8 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతంలో ఆవర్తనం.. ఈ రెండ్రోజులు ప్రమాదకరమైన వర్షాలు, ఆరు జిల్లాలకు అలర్ట్
Kandula Durgesh: అసెంబ్లీ లో కందుల దుర్గేష్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu