ప్రధాని ఆదేశాలనే పట్టించుకోని టిటిడి...ఆ నిర్ణయం తగదు: పవన్ కల్యాణ్

By Arun Kumar PFirst Published May 2, 2020, 8:39 PM IST
Highlights

లాక్ డౌన్ కారణంగా ఏ ఒక్క ఉద్యోగిణి తొలగించకూడదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినా టిటిడి ఆ ఆదేశాలను పట్టించుకోవడం లేదని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆరోపించారు. 

అమరావతి: కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఉద్యోగులకు అండగా నిలవాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే వారికి అన్యాయం చేస్తోందని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆరోపించారు. లాక్ డౌన్ ను కారణంగా చూపి ఏ ఒక్క ఉద్యోగిని  తొలగించకూడదంటూ ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచనలను ఏపి ప్రభుత్వమే తుంగలో తొక్కిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదీనంలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే 1400 ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను 
తొలగించడాన్ని పవన్ కల్యాణ్ తప్పుబట్టారు. 

''కరోనా కారణంగా అల్పాదాయ వర్గాల వారు దుర్భర  పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టి.టి.డి.)లో పని చేస్తున్న 1400 మంది ఔట్ సోర్సింగ్ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడం తీవ్రమైన అన్యాయం. దేశంలో ఏ ఒక్క కార్మికుడినీ విధుల నుంచి తొలగించరాదని, వారికి క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలని స్వయంగా దేశ ప్రధాని గౌరవనీయులైన శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రకటించినప్పటికీ టి.టి.డి. పెద్దలు ఒక్క కలం పోటుతో 1400 మంది కార్మికులను విధుల నుంచి తొలగించడం సహేతుకం కాదు. తొలగింపునకు గురైన వారంతా గత 15 సంవత్సరాలుగా పని చేస్తూ స్వల్ప జీతాలు తీసుకునే చిరు ఉద్యోగులు. టి.టి.డి. తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని వీరందరినీ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డుకి,  కార్యనిర్వహణాధికారికి విజ్ఞప్తి చేస్తున్నాను'' అంటూ రాష్ట్ర ప్రభుత్వం, టిటిడిని కోరారు పవన్ కల్యాణ్ కోరారు. 

 

click me!