మీసం మేలేయడం చేతకాదు, చేతల్లో చూపిస్తా: పేర్నినానికి పవన్ కౌంటర్

Published : Jun 15, 2023, 04:53 PM IST
 మీసం మేలేయడం చేతకాదు, చేతల్లో చూపిస్తా: పేర్నినానికి పవన్ కౌంటర్

సారాంశం

వైసీపీ  నేతల విమర్శలకు  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పందించారు. చేతలతో  సమాధానం చెబుతామన్నారు.

కాకినాడ: వైసీపీ నేతల విమర్శకు  చేతలతో సమాధానం  చెబుతామని  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  చెప్పారు.పవన్ కళ్యాణ్ కు  మాజీ మంత్రి పేర్ని నాని  తీవ్ర  విమర్శలు  చేశారు.  ఇవాళ  మీడియా సమావేశంలో  పవన్ కళ్యాణ్ కు రెండు  చెప్పులు  చూపారు. పేర్నినాని వ్యాఖ్యలపై  పవన్ కళ్యాణ్ స్పందించారు. గురువారంనాడు పవన్ కళ్యాణ్  గొల్లప్రోలులో  నిర్వహించిన  జనవాణి కార్యక్రమంలో  పేర్నినాని వ్యాఖ్యలపై  స్పందించారు.  మీసాలు మెలేయడం, తొడగొట్టం  తాను సినిమాల్లో చేయడానికి ఇబ్బంది పడతానన్నారు. 

వైసీపీ  నేతలు తిట్టినా  ఫర్వాలేదన్నారు. ఏపీ  అభివృద్దే  తన లక్ష్యంగా ఆయన  పేర్కొన్నారు.  మాటకు ఎదురు చెప్పడం  తమ దగ్గర ఉండదన్నారు. వైసీపీ  విమర్శలకు  చేతలతో  సమాధానమిస్తామని  పవన్ కళ్యాణ్  చెప్పారు ఈ వ్యాఖ్యలు  చేసినందుకు   బాధపడే రోజులు వస్తాయన్నారు.  

also read:మక్కెలిరగదీస్తాం: పవన్ కళ్యాణ్ కు రెండు చెప్పులు చూపిన పేర్నినాని

నిన్న కత్తిపూడి జంక్షన్ లో  వారాహి యాత్ర ప్రారంభం సందర్భంగా   వైఎస్ఆర్‌సీపీ పై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు  చేశారు. వైసీపీ  నేతలకు  చెప్పు చూపి  మక్కెలిరగదీస్తానని  వార్నింగ్ ఇచ్చినట్టుగా  పవన్ కళ్యాణ్  చెప్పారు.ఈ వ్యాఖ్యలపై  పేర్ని  నాని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై  మీడియా సమావేశం ఏర్పాటు  చేశారు.  పవన్ కళ్యాణ్ కు  రెండుచెప్పులు చూపారు.   డ్రామాలు చేస్తే మక్కెలిరగదీస్తామని  పవన్ కళ్యాణ్ ను  పేర్ని నాని  వార్నింగ్  ఇచ్చారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?