ఈ ప్రాంతాన్ని సందర్శించడం చాలా ఆనందంగా ఉంది

By Rekulapally Saichand  |  First Published Nov 3, 2019, 2:12 PM IST

శ్రీ పవన్ కళ్యాణ్ అదివారం ఉదయం కర్ణాటక రాష్ట్రంలో కోలార్ జిల్లాలో గౌనిపల్లి గ్రామంలో అత్యంత పురానమైన శ్రీ రుక్మిణి సత్యభమ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు.. 


శ్రీ పవన్ కళ్యాణ్ అదివారం ఉదయం కర్ణాటక రాష్ట్రంలో కోలార్ జిల్లాలో గౌనిపల్లి గ్రామంలో అత్యంత పురానమైన శ్రీ రుక్మిణి సత్యభమ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు.. అక్కడ సభలో మాట్లాడుతూ..

శ్రీ రుక్మిణి సత్యభమ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమంలో నన్ను భాగస్వామిని చేసినందుకు ఆ వేణుగోపాల స్వామికి, ఈ గౌనిపల్లి ప్రజలకూ ముఖ్యంగా జస్టీస్ గోపాల గౌడకి నా హృదపూర్వక ధన్యవాదాలు..

Latest Videos

undefined

జనసేన లాంగ్ మార్చ్: ఏయూ గేట్ల మూసివేత, విశాఖలో ఉద్రిక్తత

ఈ ప్రఖ్యాత శ్రీ రుక్మిణి సత్యభమతో శ్రీ వేణుగోపాల స్వామి చరిత్ర చూస్తే ఇవి అత్యంత పురానమైనవి ఇవి ఎప్పుడు చెక్కేరో ఎవ్వరికీ తెలయదన్నారు. దేవతలు చెక్కేరని ప్రజల నమ్మకం, ఎందుకంటే దీని వయస్సు నిర్ణయించడం అంత కష్టం.

మొఘల్ సామ్రాజ్యం కాలం ముగిసిన తర్వాత ఈపురాతన విగ్రహాలను వేరే ప్రాంతాలనుండి తరలిస్తూ ఓ రాత్రి వారు ఇక్కడ బస చేసిన బండపై ఉంచారు.  మరుసటి రోజు ఉదయం ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది.  కానీ విగ్రహాలు కదలలేదు, కదిలించలేక, దేవతలను ఆరాధించే భక్తుల ప్రభువు రుక్మిణి సత్యభామని ఇక్కడే వదిలి వెళ్లారని చరిత్ర చెబుతుంది.

పవన్ కళ్యాణ్ పై తప్పుడు రాతలు.. పూనమ్ కౌర్ దిమ్మతిరిగే సమాధానం!

వేణుగోపాల స్వామి దయవల్ల ఇప్పుడు వర్షాలు పడి కొంచెం నీరు చేరింది.. ఇక్కడి వాతావణం చూస్తే నాకు రాయలసీమ గుర్తొస్తుంది.. అక్కడి లాగే ఇక్కడ కూడా నీటి కొరత వుంది.. కరెంటు కొరత ఉన్నప్పటికీ ఇక్కడ కష్టపడి పండించిన రైతుకి గిట్టు బాటుధర లేదు..

యువతకు ఉపాధి అవకాశాలు తక్కువ అని అన్నారు. ఇంత చరిత్ర కలిగిన ఈ ప్రాంతాన్ని సందర్శించడం చాలా ఆనందంగా ఉందన్నారు. 

click me!