ఆయన నాకు అన్నయ్య కాదు... పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

By Arun Kumar PFirst Published Oct 13, 2018, 12:03 PM IST
Highlights

విజయవాడలో  జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఇకపై జనసేన పార్టీ కార్యకలాపాలన్నీ ఈ కార్యాలయం వేదికగానే జరుగుతాయని పవన్ స్పష్టం చేశారు. పార్టీ ముఖ్య నాయకులంతా అమరావతి కేంద్రంగా వున్న రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాదుండ్ల మనోహర్ తో పాటు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

విజయవాడలో  జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఇకపై జనసేన పార్టీ కార్యకలాపాలన్నీ ఈ కార్యాలయం వేదికగానే జరుగుతాయని పవన్ స్పష్టం చేశారు. పార్టీ ముఖ్య నాయకులంతా అమరావతి కేంద్రంగా వున్న రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాదుండ్ల మనోహర్ తో పాటు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ మట్లాడుతూ... టిడిపి పార్టీ తనపై చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. తాను ఏ పార్టీకి అనుకూలంగా పనిచేయడం లేదని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి సపోర్ట్ చేయడానికి తనకేమీ ఆయన అన్నయ్య కారని పవన్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే 2014 ఎన్నికల్లో టిడిపి, బిజెపి పార్టీలకు సపోర్ట్ చేసినట్లు తెలిపారు. 

శ్రీకాకుళం తిత్లీ తుఫాను దాటికి గురవడం తనను చాలా బాధించిందని పవన్ తెలిపారు. అయితే అక్కడ పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని వున్నా... గత అనుభవాల దృష్ట్యా అక్కడికి వెళ్లలేకపోతున్నానని అన్నారు. అక్కడి సహాయక చర్యలకు ఆటంకం కలగ వద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జన సైనికులు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. కవాతు తర్వాత శ్రీకాకుళంలో సందర్శిస్తానని పవన్ ప్రకటించారు. 

ఇక ఈ సభలోనే నాదెండ్ల మనోహర్ తో తనకున్న స్నేహం గురించి పవన్ వివరించారు. పబ్లిక్ స్కూళ్లో తామిద్దరం కలిసి చదువుకున్నాయని గుర్తుచేసుకున్నాడు. నాదెండ్లకు తనకు కామన్ ప్రెండ్స్ చాలా మంది ఉన్నారన్నారు. జనసేన పార్టీ పెట్టినప్పటి నుండి ఆయన సలహాలు సూచనలు ఇస్తున్నారని తెలిపారు. అకౌంటబుటిలి పాలిటిక్స్ గురించే తామిద్దరం పోరాడుతున్నామని...అందువల్లే కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు పవన్ తెలిపారు.   

రాజకీయ నాయకులే నాలుగు సార్లు మాటలు మారిస్తే ఎలా అని పవన్ ప్రశ్నించారు.  ప్రత్యేక హోదాపై పార్లమెంట్ ఇచ్చిన హామీనే నెరవేర్చులేదని...దీనిపై చంద్రబాబు కూడా ఎక్కువగా ప్రశ్నించింది లేదన్నారు. కానీ జనసేన పార్టీ అందరి కంటే ఎక్కువగా ఈ విషయంపై పోరాటం చేసినట్లు పవన్ స్పష్టం చేశారు.  

ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న ఐటీ రైడ్స్ పై పవన్ స్పందించారు. ముఖ్యమంత్రి కార్యాలయంపై ఈ రైడ్స్ జరిగితే తప్పకుండా సపోర్ట్ చేసేవాళ్లమనీ...కానీ వ్యాపారవేత్తలపై జరిగితే మేమెలా స్పందిస్తామన్నారు. 2019లో సరికొత్త రాజకీయ శకం ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావాలనే తాము ప్రయత్నిస్తున్నట్లు పవన్ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

కాంగ్రెస్ కి షాక్.. నిన్న నాదెండ్ల.. నేడు మరో కీలకనేత

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్, నాదెండ్ల మనోహర్

పవన్‌తో నాదెండ్ల భేటీ: రేపే జనసేనలోకి (వీడియో)
 

click me!