విశాఖ పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నోవాటెల్ హోటల్‌కే పరిమితమయ్యారు. దీంతో హోటల్‌లో ఇటీవల ప్రమాదవశాత్తూ మరణించిన జనసైనికుల కుటుంబాలకు ఆయన ఆర్ధిక సాయం అందించారు.
విశాఖ విమానాశ్రయంలో వైసీపీ మంత్రులు జోగి రమేశ్, రోజా, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలపై జరిగిన దాడి ఘటన ఏపీ రాజకీయాలను వేడెక్కించింది. దీనిపై వైసీపీ, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అటు పోలీసుల ఆంక్షల నేపథ్యంలో జనవాణి కార్యక్రమానికి కూడా పవన్ హాజరుకాలేకపోయారు. దీంతో నోవాటెల్ హోటల్‌లో ఇటీవల ప్రమాదవశాత్తూ మరణించిన జనసైనికుల కుటుంబాలకు ఆయన ఆర్ధిక సాయం అందించారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున మొత్తం 12 కుటుంబాలకు పవన్ కల్యాణ్ చెక్కులను అందజేశారు. మీడియా ముందే ఈ కార్యక్రమం నిర్వహించారాయన.
ఇకపోతే.. నిన్న జరిగిన దాడి ఘటనలపై మంత్రి రోజా సహాయకుడు దిలీప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు వ్యక్తులు విమానాశ్రయం వద్ద దాడికి యత్నించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. మెటల్‌తో చేసిన ఓ వస్తువు తగిలి తన తలకు గాయమైందని... ఈ దాడిలో 300 మంది జనసేన కార్యకర్తలు పాల్గొన్నట్లు దిలీప్ ఆరోపించారు. ప్రభుత్వ వాహనాలను, ఆస్తులను కూడా వారు ధ్వంసం చేశారని ఆయన ఫిర్యాదులో తెలిపారు. దీనిని విచారణకు స్వీకరించిన విశాఖ ఎయిర్‌పోర్ట్ పోలీసులు ఇప్పటి వరకు 28 మంది జనసేన నేతలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ALso Read:300 మంది చుట్టుముట్టారు... మంత్రి రోజా సహాయకుడు ఫిర్యాదు, 28 మంది జనసేన నేతలపై కేసు
మరోవైపు... జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస చేసిన నోవాటెల్ హోటల్ వద్ద ఉద్రిక్తతో చోటు చేసుకుంది. పవన్‌ను చూసేందుకు విశాఖ, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా జనసైనికులు అక్కడికి చేరుకున్నారు. దీంతో అరుపులు, కేకలు, నినాదాలతో బీచ్ రోడ్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు జనసైనికులను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు.
అంతకుముందు పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. నేరస్తుడి చేతిలో అధికారంలో ఉంటే ఇలానే ఉంటుందని రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితులపై విమర్శించారు. విశాఖ పోలీసులు పవన్ కళ్యాణ్ కు ఆదివారం నాడు నోటీసులు అందించారు. ఈ నోటీసులు అందుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. తాను విశాఖపట్టణానికి రాకముందే గొడవ జరిగిందన్నారు. కానీ తాము రెచ్చగొట్టడంవల్లే గొడవ జరిగిందని పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. ప్రజల కోసం పోరాడితే నోటీసులు ఇచ్చారన్నారు.
క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు జనసేన భరోసా
* ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన 12 కుటుంబాలకు రూ.60 లక్షల అందచేత
* స్వయంగా చెక్కులు అందచేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
• పోలీసుల ఆంక్షల నేపధ్యంలో మీడియా ఎదుట చెక్కుల పంపిణీ pic.twitter.com/2tz3PdnsFO