నువ్వు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకో.. ఎవడొద్దన్నాడు: జగన్‌కు పవన్ కౌంటర్

By sivanagaprasad Kodati  |  First Published Nov 12, 2019, 4:20 PM IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్


ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కావాలనుకుంటే ‘‘జగన్ కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చునని ఇందుకు ఎవరు అభ్యంతరం చెప్పరని పవన్ ఘాటుగా బదులిచ్చారు. ‘‘ నువ్వు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకో ఎవడొద్దన్నాడు.. నేనేమైనా సరదాకి చేసుకున్నానా’’ అని జగన్‌పై పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు.

మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తాము ఇసుక సమస్య, తెలుగు భాష గురించి మాట్లాడానని రాజకీయాల గురించి మాట్లాడాలి కాని వ్యక్తిగత దూషణలు సరికాదన్నారు

Latest Videos

undefined

ప్రజల సమస్యలను పరిష్కరించాలి కానీ వ్యక్తిగత వ్యాఖ్యలు వద్దని పవన్ సూచించారు. తెలుగుదేశం పార్టీ నేతలను వ్యక్తిగతంగా తిడితే చెల్లుతుందేమో కానీ జనసేన నేతలు  కానీ పార్టీ కాని పడదని పవన్ స్పష్టం చేశారు.

read more  'పవన్ కళ్యాణ్‌కు ముగ్గురు భార్యలు, నలుగురు పిల్లలు ఏ స్కూళ్లో చదువుతున్నారు'

అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల్లో మాట్లాడాల్సింది విద్యా వ్యవస్థ, విద్యార్ధుల గురించి కానీ తనను తిట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. 151 మంది ఎమ్మెల్యేలున్న మీరు ఒక్క ఎమ్మెల్యే ఉన్న జనసేనకు భయపడుతున్నారని పవన్ ఎద్దేవా చేశారు. 

మేమంటే భయపడుతున్నారు కాబట్టే సీఎం స్థాయి వ్యక్తి అంతఘాటుగా స్పందిస్తున్నారని జనసేనాని అభిప్రాయపడ్డారు. గెలుపొటములు తమకు అనవసరమని.. ప్రజలతో ప్రయాణమే తమ లక్ష్యమన్నారు. తోట చంద్రశేఖర్ లాంటి సీనియర్ అధికారులు తయారు చేసిన సిఫారసులను అమలు చేయాలని తాను విశాఖలో చెప్పిన సంగతిని పవన్ గుర్తు చేశారు. 

‘‘ఈ దేశ ఆర్థిక ప్రగతికి ఇసుక చాల ముఖ్యం. ఇసుక పాలసి విధానాన్ని గత ప్రభుత్వం లో కూడా ఎండగట్టాము.  40కి పైగా అనుబంధం విభాగాలు  రోడ్డున పడ్డాయి’’ అని అన్నారు

‘‘2 సం. వరకు మాకు పని ఉండదు అనుకున్నాం, 4 నెలలు పాటు 35 లక్షల మంది ఇబ్బంది పడ్డారు. ప్రజలు మా దగ్గరికి వస్తున్నారూ కాబట్టి ప్రెస్ మీట్ లు పెడ్తున్నాము’’ అని పవన్ చెప్పారు. 

Also Read: పవన్, బాబు విమర్శలు: హైదరాబాద్ కు ఇసుక రవాణాకు జగన్ చెక్

‘‘జగన్ రెడ్డి మాట్లాడినప్పుడు నాయకులకు ఒకటే చెప్పి వ్యక్తి గతంగా మాట్లాడకూడదని చెప్పా. బయటకి వస్తే లక్ష వరకు లాంగ్ మార్చ్ లో వస్తారని చెప్పాం’’ అని జనసేనాని వ్యాఖ్యానించారు. 

‘‘ఈరోజు గవర్నర్ ని కలిసాం, పరిణామాలు చర్చించాము. సాండ్ కి డిమాండ్ చాలా ఉంది,  పర్యావరణం దెబ్బ తినకుండా ఎలా ఉండాలని నివేదిక కూడా ఇచ్చాం,  అయినప్పటికీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడ్తున్నారు’’ అని పవన్ ఎద్దేవా చేశారు.

‘‘జగన్ రెడ్డి ని కుల పరంగా చూడం రాజకీయ నాయకుడు గా చూస్తాం. తూ. గో.జిల్లాకు వెళ్లి కాపు రిజర్వషన్ కు వ్యతిరేకం అని చెప్పిన ప్రజలు మీకే ఓటు వేశారు’’ అన్న సంగతిని పవన్ గుర్తు చేశారు.

‘‘మాట్లాడిటితే ప్రతిసారి మూడు పెళ్లిళ్లు అంటారు, మీరు కూడా చేసుకోండి.! నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని అన్నారు . ‘‘అసలు 2 సంవత్సరాలు జైలులో ఉన్నది, జగన్ రెడ్డి, విజయ సాయి రెడ్డే’’ అని పవన్ కల్యాణ్ విమర్శించారు

Also Read:పవన్ పై వైఎస్ జగన్ ముగ్గురు భార్యల వ్యాఖ్యలు: మిగతా అంతా...

‘‘జనసేన చాలా బలంగా స్పందిస్తుంది, 10 థౌజండ్ వాలా 151 ఎమ్మెల్యే లకి అంటిస్తే తగలబడిపోతారు.’’ అని పవన్ ధ్వజమెత్తారు. ‘‘నేను భాషకు వ్యతిరేకం కాదు పొట్టి శ్రీరాములు అనే వ్యక్తి తెలుగు వారికి రాష్టం ఉండాలని 50 రోజులకి పైగా దీక్ష చేసిన వ్యక్తి’’ సమస్యలను ప్రస్తావనకు తెస్తే మమ్మల్ని నీచంగా  మట్లాడుతున్నారని దుయ్యబట్టారు

‘‘తెలుగు భాషా పట్ల మీకు ఉన్న గౌరవం ఇదేనా. తెలుగు పట్ల మాకు గౌరవం ఉంది కాబట్టి సంస్కారంతో మాట్లాడుతున్నా..  విజయవాడ నడిబొడ్డున కూర్చొని చెప్తున్నా’’నని పవన్ వ్యాఖ్యానించారు. 

‘‘మీ ఫ్యాక్షణిస్టు రాజకీయాలకు నేను బయపడను. తెలుగు భాషా గురించి చెప్పిన వాళ్ళని ఎగతాళిగా మాట్లాడతారా.  సమాజాన్ని విచ్చిన్నం చేసేలా జగన్ మాట్లాడుతున్నారు’’ అని పవన్ విమర్శించారు. 

‘‘నాలుగు నెలలుగా రాష్ట్రం  అతలాకుతలం అయిపోయింది. ఆంధ్రదేశంలో పుట్టి పరిపూర్ణ మైన తెలుగును మనం మాట్లాడలేక పోతున్నాము. తెలుగు దండగ అని మీరు ముందుకు వెళ్ళిపోతే, విద్యార్థులు దెబ్బ తింటారు, అటు ఇంగ్లీష్, తెలుగు రాక విద్యార్థులు ఇబ్బందులు పడతారు’’ అని జనసేనాని స్పష్టం చేశారు. 

‘‘కడప,హిందూపూర్, మరిన్ని గ్రామాలలో తెలుగు శాసనాలు  బయటపడ్డాయి, రాయలసీమ ప్రాంతం నుండి వచ్చిన మీరు తెలుగు భాష పట్ల  అలా మాట్లాడకూడదు. పెద్ద తిరుపతిలో వేంకటేశ్వరస్వామి సుప్రభాతం కూడా ఇంగ్లీష్ లో చదివించండి’’ అని పవన్ అన్నారు. 

‘‘రాష్ట్రంలో పెట్టుబడులు వెనక్కి పోతున్నాయి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి హుందాగా వ్యవహరించండి. మీరు వైసీపీ నాయకులు కాదు ముఖ్యమంత్రి. మీరు గోడవలకి రెడీ అంటే నేను కూడా రెడీగా ఉన్నానని పవన్ సవాల్ విసిరారు. 

click me!