డబ్బు పంచితేనే గెలిచారు, మా ఎమ్మెల్యేను లాక్కోవాలని చూస్తారా: వైసీపీపై పవన్ కళ్యాణ్

By Nagaraju penumalaFirst Published Aug 14, 2019, 6:53 PM IST
Highlights

 జనసేన పార్టీకి ఉన్న ఒక్క ఎహ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని పవన్ ఆరోపించారు. అందువల్లే రాపాక వరప్రసాదరావుపై అనేక కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. తనను రెచ్చగొట్ట వద్దని పవన్ హెచ్చరించారు. రెచ్చగొడితే ఎంతవరకు అయినా పోరాడతానని పవన్ అధికార పార్టీకి హెచ్చరించారు.

అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. డబ్బు పంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. డబ్బు పంచి ఉంటే జనసేన కూడా మంచి స్థానాలే గెలిచేదని చెప్పుకొచ్చారు. 

మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో మాట్లాడిన పవన్ జనసేన పార్టీకి ఉన్న ఒక్క ఎహ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని పవన్ ఆరోపించారు. అందువల్లే రాపాక వరప్రసాదరావుపై అనేక కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. తనను రెచ్చగొట్ట వద్దని పవన్ హెచ్చరించారు. రెచ్చగొడితే ఎంతవరకు అయినా పోరాడతానని పవన్ అధికార పార్టీకి హెచ్చరించారు. 
 

click me!