టికెట్ కోసం రికమండేషన్ అడిగి.. ఇప్పుడు నామీదే తిట్లు: వైసీపీ ఎమ్మెల్యేపై పవన్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Feb 16, 2020, 2:30 PM IST
Highlights

సంయమనంతో ఉండమన్నాను కానీ కొడుతుంటే కొట్టించుకోమని తాను ఎప్పుడూ చెప్పలేదని కార్యకర్తలతో అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఆయన పర్యటించారు

2014లో ఎమ్మెల్యే టికెట్ కోసం రికమండేషన్ అడిగిన కొట్టు సత్యనారాయణ ఇవాళ తనను అనే స్థాయికి వచ్చారా అంటూ పవన్ నిలదీశారు. తిడితే ఓట్లు పడతాయి అనుకుంటే అలాంటి ఓట్లు తనకు అక్కర్లేదని జనసేనాని తేల్చి చెప్పారు.

సంయమనంతో ఉండమన్నాను కానీ కొడుతుంటే కొట్టించుకోమని తాను ఎప్పుడూ చెప్పలేదని కార్యకర్తలతో అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఆయన పర్యటించారు.

Also Read:బీజేపీతో వైసీపీ జత కలిస్తే జనసేన కటీఫ్: తేల్చేసిన పవన్

ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి పవన్ మాట్లాడుతూ.. తమ మీద దాడి చేస్తే ఎలా బుద్ది చెప్పాలో తనకు తెలుసునన్నారు. సినీ పరిశ్రమలో తాను వస్తుంటే రెడ్ కార్పెట్ పరుస్తారని.. అదే రాజకీయాల్లో అయితే దారిపోయే ప్రతి ఒక్కరి చేత తిట్లు, చీవాట్లు తినాల్సి ఉంటుందన్నారు.

రాజకీయం డబ్బుతో, అవినీతిపరులతో నిండిపోయిందని.. డబ్బు ఖర్చు పెట్టకపోయినా, ఎన్నికల్లో ఓటమిపాలైనా ప్రజల వెంటే ఉంటామన్నారు. సుగాలి ప్రీతి కేసు ఇప్పటిది కాదంటున్నారని.. అప్పుడు వివేకానందరెడ్డి హత్య కేసును, కోడి కత్తి కేసును వదిలివేయాలని పవన్ డిమాండ్ చేశారు.

Also Read:PSPK27: పక్కా ప్లాన్ తో రెడీ అవుతున్న పవన్

చెడు కోసం రౌడీయిజం చేసే వాళ్లకే అంత బలం ఉన్నప్పుడు.. మంచి కోసం పోరాడుతున్న మనకు ఇంకెంత పట్టుదల ఉండాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రచారంలో మన సభలకు వచ్చిన యువతలో సగం మంది నిలబడినా జనసేనకు 60 సీట్లు వచ్చి వుండేవన్నారు. పరిస్ధితుల కారణంగానే తాను రెండు చోట్ల పోటీ చేయాల్సి వచ్చిందని పవన్ తెలిపారు. 

click me!