పంచాయతీ ఎన్నికలు పెట్టాల్సిందే: తేల్చేసిన పవన్ కల్యాణ్

Siva Kodati |  
Published : Jan 23, 2021, 03:05 PM IST
పంచాయతీ ఎన్నికలు పెట్టాల్సిందే: తేల్చేసిన పవన్ కల్యాణ్

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. కరోనాను బూచిగా చూపి ఎన్నికలు వాయిదా వేయాలని కోరడం సరికాదని ఆయన ఎద్దేవా చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. కరోనాను బూచిగా చూపి ఎన్నికలు వాయిదా వేయాలని కోరడం సరికాదని ఆయన ఎద్దేవా చేశారు.

వైసీపీ నేతలు ర్యాలీలు చేసినప్పుడు కరోనా గుర్తుకు రాలేదా అని పవన్ ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్‌, జడ్జిలకు కులాలను అంటగట్టడం అన్యాయమని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న పొరపాటు జరిగితే జర్నలిస్టులపై బలమైన కేసులు పెట్టారని... వివేకా హత్య వంటి పెద్ద కేసులపై పోలీసులు దృష్టి పెట్టాలని పవన్‌ హితవు పలికారు. 

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ శనివారం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.  

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.

రెవెన్యూ డివిజన్‌ ప్రాతిపదికగానే ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. తొలి దశలో విజయనగరం, ప్రకాశం జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు.  

రాష్ట్రంలో 68 రెవెన్యూ డివిజన్లలో నాలుగు‌ విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు విడతల్లో కలిపి 659 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

తొలి విడతలో 14 రెవెన్యూ డివిజన్లలో 146 మండలాల్లో, రెండో‌ విడతలో  17 రెవెన్యూ డివిజన్లలోని 173 మండలాల్లో, మూడో విడతలో 18 రెవెన్యూ  డివిజన్లలోని 169మండలాల్లో, నాలుగో‌ విడతలో భాగంగా‌ 19 రెవెన్యూ డివిజన్లలోని 171మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి.

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu