నమస్కారానికి.. ప్రతి నమస్కారం లేదు, ఏం మాట్లాడతారోనని భయమేస్తోంది.. ఏపీలో పరిస్థితి ఇది : పవన్

Siva Kodati |  
Published : Oct 29, 2022, 09:47 PM ISTUpdated : Oct 29, 2022, 09:48 PM IST
నమస్కారానికి.. ప్రతి నమస్కారం లేదు, ఏం మాట్లాడతారోనని భయమేస్తోంది.. ఏపీలో పరిస్థితి ఇది : పవన్

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నమస్కారం పెడితే ప్రతి నమస్కారానికి బదులుగా ఏం మాట్లాడతారోనని భయంగా వుందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.   

ప్రజాస్వామ్యంలో నియంత పోకడలు చెల్లవన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ప్రభుత్వ వైఫల్యాలు తెలుస్తామనే జనవాణిని అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ పవన్ కల్యాణ్ నిలదీశారు. రాష్ట్రంలో కనీసం సంస్కారం పాటించే సంప్రదాయం కూడా లేదన్న ఆయన.. నమస్కారం పెడితే ప్రతి నమస్కారానికి బదులుగా ఏం మాట్లాడతారోనని భయంగా వుందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. 

మరోవైపు.. ఇటీవల విశాఖ విమానాశ్రయంలో మంత్రులపై దాడి చేశారంటూ అరెస్ట్ అయి విడుదలైన 9 మంది జనసేన నేతలను ఘనంగా సన్మానించారు పవన్ కల్యాణ్. శనివారం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా నాటి ఘటనలో అరెస్ట్ అయిన నేతలతో పాటు వారి కుటుంబ సభ్యులను జనసేన నేతలు మంగళగిరికి రప్పించారు. ఈ క్రమంలో వారితో పవన్ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అరెస్ట్ అయి విడుదలైన 9 మంది నేతలకు పవన్ శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం వారితో మాట్లాడి నాటి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. భవిష్యత్‌లోనూ ప్రజా పోరాటాలు చేయాలని, పార్టీ అండగా వుంటుందని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. 

ALso Read:జనసేన నేతలపై కేసులు.. విశాఖలో అక్రమాలు బయటపడతాయనే : జగన్ ప్రభుత్వంపై పవన్ ఆగ్రహం

అంతకుముందు .. విశాఖ విమానాశ్రయంలో మంత్రులు జోగి రమేశ్, రోజా , టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలపై దాడులకు సంబంధించి అరెస్ట్ అయిన 9 మంది జనసేన నేతలకు బెయిల్ లభించడం పట్ల ఈ నెల 22న పవన్ కల్యాణ్ స్పందించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. విశాఖలో అధికారపక్షం బనాయించిన అక్రమ కేసుల కారణంగా జైలు పాలైన జనసేన నేతలు బెయిల్‌పై బయటకు రావడం సంతోషించదగ్గ పరిణామమన్నారు. వీరు కారాగారంలో వున్న సమయంలో వీరి కుటుంబ సభ్యులు ఎంత ఆందోళనకు గురయ్యారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. వీరిని బయటకు తీసుకొచ్చేందుకు న్యాయ పోరాటం చేసిన జనసేన లీగల్ సెల్ సభ్యులకు, వారికి అండగా నిలిచిన లాయర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు 

విశాఖలో అక్రమాలకు పాల్పడుతోన్నవారు ఎవరో నగర ప్రజలకు, ఏపీ ప్రజలకు తెలుసునని పవన్ దుయ్యబట్టారు. వాస్తవాలు మరింతగా వెలుగులోకి వస్తాయనే జనసేన నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే విశాఖలో జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు విమానాశ్రయంలో డ్రామాలు సృష్టించారని పవన్ ఆరోపించారు. ఈ ఘటనల సాకుతో జనసేన నేతలు, వీర మహిళలు, కార్యకర్తలను ఇరికించారని.. నిబంధనలకు విరుద్ధంగా వీరిని అర్ధరాత్రి వేళ అరెస్ట్ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కచ్చితంగా న్యాయ పోరాటం చేయాలని, కేసులు దాఖలు చేయాలని జనసేన లీగల్ సెల్ సభ్యులకు పవన్ కల్యాణ్ సూచించారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!