హోదా విషయంలో టీడీపీ యూటర్న్, మద్దతు కోసమే బీఎస్పీతో పొత్తు : పవన్ కళ్యాణ్

By Nagaraju penumalaFirst Published Jun 24, 2019, 5:59 PM IST
Highlights

ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలపై తాము బీఎస్పీ అధినేత్రి మాయావతితో మాట్లాడానని ఆమె మద్దతు ఇస్తామని చెప్పడంతో పొత్తుపెట్టుకున్నామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో జనసేన పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 
 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తాము మద్దతు పలుకుతామని హామీ ఇవ్వడంతోనే తాము బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. 

ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలపై తాము బీఎస్పీ అధినేత్రి మాయావతితో మాట్లాడానని ఆమె మద్దతు ఇస్తామని చెప్పడంతో పొత్తుపెట్టుకున్నామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో జనసేన పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 

హోదా కోసం మెుదటి నుంచి పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ జనసేన అని చెప్పుకొచ్చారు. అయితే ప్రత్యేక హోదా అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు మరచిపోయాయన్నారు. ప్రత్యేక హోదా వల్ల ఎక్కువ పరిశ్రమలు వస్తాయని, రాయితీలు వస్తాయని, ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఫలితంగా రాష్ట్రం బాగుపడుతుందని అందువల్లే తాము పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. 

అలాంటి హోదాపై తెలుగుదేశం పార్టీ యూటర్న్ లు తీసుకుందన్నారు. పదిసార్లు టీడీపీ మాట తప్పిందన్నారు. ఇకపోతే భవిష్యత్ లో బీఎస్పీతో పొత్తు అనేది కాలమే నిర్ణయించాలని పవన్ అభిప్రాయపడ్డారు. 

ప్రస్తుతానికి ఒంటరిగానే పయనిస్తామని పార్టీని బలోపేతం చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు పవన్ కళ్యాణ్. ఎన్నికల ఫలితాల అనంతరం తనతో బీఎస్పీ నేతలు ఎలాంటి సంప్రదింపులు జరపలేదన్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

తప్పు చేస్తే ప్రశ్నిస్తాం, మంచి చేస్తే ప్రశంసిస్తాం: జగన్ ప్రభుత్వంపై పవన్ వ్యాఖ్యలు

click me!