ఈ నెల 14వ తేదీ నుంచి పవన్ కల్యాణ్ యాత్ర ప్రారంభం కానుంది. అన్నవరం నుంచి భీమవరం వరకు తొలి విడత యాత్ర సాగనుంది. ఈ యాత్ర పొత్తులో భాగంగా జరిగేది కాదని నాదెండ్ల స్పష్టం చేశారు.
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 14 నుంచి యాత్ర మొదలు పెట్టనున్నారు. ప్రత్యేకంగా తయారు చేసిన వారాహి వాహనంలో ఆయన పర్యటన చేయనున్నారు. అన్నవరంలో పూజ చేసిన తర్వాత పవన్ కల్యాణ్ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యాతర్ పొత్తులో భాగంగా జరిగేది కాదని స్పష్టం చేశారు.
తొలి విడత యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, రాజోలు, పి గన్నవరం నుంచి నర్సాపురం వరకు చేరుతారు. అన్నవరం నుంచి భీమవరం వరకు తొలి విడత యాత్ర సాగుతుందని జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
Also Read: చెప్పాల్సిదంతా చెప్పా, పార్టీ నిర్ణయం కోసం వేచి చూస్తా: కోడెల శివరాం
తూర్పు గోదావరి జిల్లాలో యాత్ర షెడ్యూల్ ఖరారైంది. తూర్పు గోదావరిలోని పది నియోజకవర్గాల్లో వారాహి యాత్ర సాగనుంది. పర్యటనలో ప్రతి రోజూ ఒక ఫీల్డ్ విజిట్ ఉంటుందని పార్టీ తెలిపింది.