తాను చెప్పదలుచుకున్నదంతా పార్టీ నేతలకు వివరించానని కోడెల శివరాం తెలిపారు. శివరాంతో పార్టీ నేతలు ఇవాళ భేటీ అయ్యారు.
హైదరాబాద్: తన అభిప్రాయాలను పార్టీ నాయకత్వానికి చెప్పానని కోడెల శివరాం చెప్పారు. శుక్రవారంనాడు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కోడెల శివరాంతో భేటీ అయ్యారు. సత్తెనపల్లి టీడీపీ ఇంచార్జీగా కన్నా లక్ష్మీనారాయణను టీడీపీ నాయకత్వం నియమించడంపై కోడెల శివరాం అసంతృప్తితో ఉన్నారు. అనుచరులతో ఆయన సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.కోడెలశివరాంతో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు భేటీ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు.
also read:కోడెల శివరామ్ కు టీడీపీ బుజ్జగింపులు: జీవీ, నక్కా ముందు టీడీపీ శ్రేణుల నిరసన
undefined
కన్నా లక్ష్మీనారాయణకు రాజమార్గం, కోడెలకు సమాధి అన్నట్టుగా టీడీపీ నాయకత్వం వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. చంద్రబాబును వ్యక్తిగతంగా దూషించిన కన్నాకు ఎందుకు సహకరించాలని ఆయన ప్రశ్నించారు. కోడెల పేరు తలచుకోకూడదని పార్టీ నాయకులు కుట్రలు చేశారన్నారు. తాను చెప్పాల్సిదంతా పార్టీ నాయకులకు చెప్పినట్టుగా శివరాం వివరించారు. పార్టీ నిర్ణయం కోసం వేచి చూస్తానన్నారు.
కోడెల కుటుంబానికి న్యాయం చేస్తాం: మాజీ మంత్రి నక్కా
కోడెల శివప్రసాదరావు కుటుంబానికి న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు చెప్పారు., కోడెల శివరాం ఆవేదనను పార్టీ నాయకత్వం అర్ధం చేసుకుందని మాజీ మంత్రి తెలిపారు. కన్నా లక్ష్మీనారాయణను ఏ కారణాలతో ఇంచార్జీగా నియమించాల్సి వచ్చిందో కోడెల శివరామ్ కు వివరించినట్టుగా మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు