వైసిపి లో చేరిన జనసేన అభ్యర్ధి, కార్యకర్తలు (వీడియో)

Published : Feb 27, 2021, 03:06 PM IST
వైసిపి లో చేరిన జనసేన అభ్యర్ధి, కార్యకర్తలు (వీడియో)

సారాంశం

జనసేన అభ్యర్ధి కామరాజ్ హరీష్ కుమార్కి వైసిపి కండువా కప్పి మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ.. జనసేన అభ్యర్ధికి బి ఫామ్ ఇచ్చి, అతని గెలుపు కోసం కాకుండా  టిడిపి గెలవాలని స్ధానిక జనసేన నాయకులే సొంత‌క్యాడర్ ను ఓడించేందుకు ప్రయత్నించడం బాధాకరం అన్నారు.

జనసేన అభ్యర్ధి కామరాజ్ హరీష్ కుమార్కి వైసిపి కండువా కప్పి మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ..
జనసేన అభ్యర్ధికి బి ఫామ్ ఇచ్చి, అతని గెలుపు కోసం కాకుండా  టిడిపి గెలవాలని స్ధానిక జనసేన నాయకులే సొంత‌క్యాడర్ ను ఓడించేందుకు ప్రయత్నించడం బాధాకరం అన్నారు.

"

టిడిపితో జనసేన లోపాయికారం ఒప్పందం కుదుర్చుకోవడం నచ్చకనే జనసేన నుంచి వైసిపిలోకి భారీగా  చేరుతున్నారన్నారు. పవన్ ఫామ్ హౌస్ లో ఉండడంతో స్ధానికంగా ఏం జరుగుతుందో ఆయనకు తెలియడం లేదని ఎద్దేవా చేశారు.

పవన్ జగన్ ను తిట్టడం తప్ప తన పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోలేని నేత అని, పవన్ కళ్లు తెరవాలని అన్నారు. కార్పొరేటర్ గా కూడా గెలవలేని వారు జగన్ ను, ప్రభుత్వాన్ని అడ్డగోలుగా విమర్శిస్తున్నారన్నారు. 

కాల్ మనీ తీసుకొని డబ్బులు ఎగ్గొట్టేవాడు ఇక్కడ మాట్లాడుతున్నారు. చంద్రబాబు తో పవన్ అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. స్ధానికంగా జనసేన టిడిపి నేతలు ఒప్పందం ఒక్కొక్కడిగా బయటపడుతుంది. వైసిపి ని ఓడించేందుకు టిడిపి జనసేన కు ఓటు  వేయమని, జనసేన టిడిపి కి ఓటు వేయమని దిక్కుమాలిన ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శించారు. 

ప్రజలంతా‌ గమనిస్తున్నారని,  వైసిపి విజయవాడలోని  64 డివిజన్లు గెలుస్తుందని వెల్లంపల్లి అన్నారు. జనసేన నుంచి  అన్యాయం జరిగిందని ఎవరైనా  వస్తే వైసిపి వారికి  అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu
CM Chandrababu: నిధులు లేవని ప్రాజెక్ట్స్ నిలపకండి అధికారులకు సీఎం ఆదేశాలు | Asianet News Telugu