
బందర్ ఎమ్మెల్యే గొప్పవాడైతే పోటీ పెట్టనని.. పేర్ని నాని అక్రమార్కుడైతే ఓడించాల్సిందేనని పవన్ వ్యాఖ్యానించారు. ఇద్దరు అసిస్టెంట్ లోకాయుక్తలను పెట్టలేని వ్యక్తి న్యాయ రాజధానిని పెడతాడా అని ఆయన ప్రశ్నించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం సాధ్యం కాదని .. కానీ జనసేన ప్రభుత్వంలో ప్రాంతాల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని పవన్ తెలిపారు. మద్యపాన నిషేధం చేస్తానన్న వాడు కల్తీ మద్యం అమ్ముతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వంలో గంజాయి దందాను అరికడతామని పవన్ స్పష్టం చేశారు. వైసీపీ నేతలు మాట్లాడే ప్రతి మాటకు శిస్తు కక్కిస్తామని ఆయన హెచ్చరించారు. వైసీపీ వాళ్లు తొడలు కొడుతున్నారని .. రెండు తొడలు బద్ధలు కొడతామన్నారు.
బీజేపీతో పొత్తు అంటే ముస్లింలు తనను వదిలేస్తున్నానరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆజాన్ వినిపిస్తే తన మీటింగ్ ఆపేస్తానని పవన్ గుర్తుచేశారు. జగన్ ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తారో తనకు తెలుసునని.. కేంద్రంలో ఏ పార్టీ వుంటే ఆ పార్టీకి జగన్ మద్ధతు ఇస్తారని జనసేనాని స్పష్టం చేశారు. ముస్లిం సమాజంపై ఎవరూ వేలు పెట్టినా తాట తీస్తామని పవన్ హామీ ఇచ్చారు. తాను బీజేపీతో వున్నన్ని రోజులూ ముస్లింలపై దాడి జరిగితే పొత్తు నుంచి బయటకు వస్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. బెదిరించడానికి , సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టడానికి చిన్నపిల్లలు కాదు కానీ.. సీసీఎస్ హామీ నెరవేర్చడానికి కాదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు జరుగుతుంటే మీకు కోపం రావడం లేదా అని ప్రజలను నిలదీశారు. రామతీర్థం, పీఠాపురంలలో ఆలయాలు ధ్వంసం అయితే ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మద్య నిషేధం చేస్తానన్న వ్యక్తి ప్రజల సంపాదనకు ప్రజాప్రతినిధులు ధర్మకర్తలు మాత్రమేనని పవన్ స్పష్టం చేశారు. అక్రమ సంపాదనను ప్రజలను కొనేందుకే వాడుతున్నారని ఆరోపించారు. దేశం మొత్తానికి గంజాయి ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్తోందని.. అరకు బోర్డర్ నుంచే గంజాయి సప్లయ్ అవుతోందని దీనిని వైసీపీ నేతలు ప్రోత్సహిస్తున్నారని పవన్ వ్యాఖ్యానించారు. విలువలు మాట్లాడే నాలాంటి వాడు ఓడిపోతూనే వున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.