పవన్ కల్యాణ్ కు భారీ షాక్: జనసేనకు కోశాధికారి రాజీనామా

Published : May 02, 2019, 09:21 PM IST
పవన్ కల్యాణ్ కు భారీ షాక్: జనసేనకు కోశాధికారి రాజీనామా

సారాంశం

వ్యక్తిగత కారణాలతో పార్టీలోని అన్ని పదవులను వదులుకుంటున్నట్లు మారిశెట్టి రాఘవయ్య తన రాజీనామా లేఖలో తెలిపారు. ఆయనతో పాటు మరో నేత అర్జున్ కూడా జనసేనకు రాజీనామా చేశారు.

అమరావతి: పవన్‌ కల్యాణ్‌ నాయకత్వంలోని జనసేనకు భారీ షాక్‌ తగిలింది. సీనియర్‌ నేత, జనసేన కోశాధికారి మారిశెట్టి రాఘవయ్య పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గురువారం పవన్ కల్యాణ్‌కు పంపించారు. 

వ్యక్తిగత కారణాలతో పార్టీలోని అన్ని పదవులను వదులుకుంటున్నట్లు మారిశెట్టి రాఘవయ్య తన రాజీనామా లేఖలో తెలిపారు. ఆయనతో పాటు మరో నేత అర్జున్ కూడా జనసేనకు రాజీనామా చేశారు. ఎన్నికల ఫలితాలు రాక ముందే నాయకుల వరుస రాజీనామాలు జనసేన పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. 

మారిశెట్టి రాఘవయ్య ప్రజారాజ్యం పార్టీలోనూ కీలకంగా వ్యవహరించారు. తనను పట్టించుకోకపోవడంతో గత కొంతకాలంగా ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్టీకి ఆయన రాజీనామా చేశారు. కాగా, జనసేన అధికార ప్రతినిధి అద్దెపల్లి శ్రీధర్‌ ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu