ఇరిగేషన్ శాఖ అనుమతి నిరాకరణ: జనసేనాని శ్రమదానం వేదిక మార్పు, ఎక్కడంటే?

By narsimha lodeFirst Published Oct 1, 2021, 4:30 PM IST
Highlights

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రేపు శ్రమదానం చేసే స్థలాన్ని మార్చారు. కాటన్ బ్యారేజీపిై శ్రమదానం చేయడానికి ఇరిగేషన్ శాఖ అనుమతి ఇవ్వలేదు. దీంతో రాజమండ్రి హుకుంపేటలోని బాలాజీపేటకు శ్రమదానం చేయాలని జనసేన నిర్ణయించింది.  

అమరావతి: జనసేన (jana sena)చీఫ్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) అక్టోబర్  2వ తేదీన రోడ్ల దుస్థితిపై చేపట్టిన శ్రమదానం (sramadanam)కార్యక్రమంలో స్పల్ప మార్పులు చోటు చేసుకొన్నాయి. రాజమండ్రికి సమీపంలోని కాటన్ బ్యారేజీపై (cotton barrage)  శ్రమదానం చేయాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకొన్నారు.

అయితే కాటన్ బ్యారేజీపై శ్రమదానం చేయడానికి ఇరిగేషన్ శాఖ (irrigation department) అనుమతి ఇవ్వలేదు. ఇష్టారీతిలో ఈ బ్యారేజీపై గుంతలు పూడ్చితే బ్యారేజీకి ప్రమాదమని ఇరిగేషన్ శాఖ ఎస్ఈ తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్ శ్రమదాన కార్యక్రమానికి అనుమతిని నిరాకరిస్తున్నట్టుగా ఎస్ఈ ప్రకటించారు.

దీంతో కాటన్ బ్యారేజీపై కాకుండా మరో చోట శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించాలని  జనసేన నిర్ణయం తీసుకొంది.రాజమండ్రి హుకుంపేటలోని బాలాజీపేటకు శ్రమదానం చేయాలని జనసేన నిర్ణయించింది.  బాలాజీపేట కనకదుర్గమ్మ గుడి వద్ద సభ నిర్వహిస్తారు.ఈ సభ తర్వాత పవన్ కళ్యాణ్ శ్రమదానంలో పాల్గొంటారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై జనసేన శ్రమదానం చేయాలని నిర్ణయం తీసుకొంది.  జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రోడ్ల మరమ్మత్తుల కోసం ఒక్క పైసా ఖర్చు చేయలేదని జనసేన తీవ్ర ఆరోపణలు చేసింది. 
 

click me!