తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ ఏ కార్యక్రమం పెట్టినా ఆ పది మందే వస్తారని, ప్రతి చిన్న విషయానికి ధర్నాలూ సభలూ పెట్టడం సరి కాదని ఆయన అన్నారు.
అమరావతి: తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మీద జనసేన శాసనసభ్యుడు రాపాక వరప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ కాకినాడలో చేసిన రైతు సౌభాగ్య దీక్షకు ఆయన గైర్హాజరైన విషయం తెలిసిందే. దానికితోడు, తనకు షోకాజ్ నోటీసు జారీ చేయడంపై కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా శుక్రవారంనాడు పవన్ కల్యాణ్ పై రాపాక వరప్రసాద్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేస్తూ ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. ఇతర కారణాలతో తాను పవన్ కల్యాణ్ రైతు సౌభాగ్య దీక్షకు వెళ్లలేదని చెప్పారు.
Also Read: షోకాజ్ నోటీస్: పవన్ కల్యాణ్ మీద ఎమ్మెల్యే రాపాక తిరుగుబాటు
పవన్ కల్యాణ్ ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఆ పదిమంది మాత్రమే వస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి చిన్న విషయానికి ధర్నాలు, సభలు పెట్టడం సరి కాదని ఆయన పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి అన్నారు. ముందు ముందము పవన్ కల్యాణ్ సభలకు ఇంకా ఆదరణ తగ్గిపోతుందని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలపై రాపాక వరప్రసాద్ ప్రశంసలు కురిపించారు. ఆంగ్ల మాధ్యమం విషయంలోనే కాకుండా మరో అంశం విషయంలో కూడా రాపాక వరప్రసాద్ పవన్ కల్యాణ్ తో విభేదించారు.
Also Read: పవన్ కల్యాణ్ కు ఎమ్మెల్యే రాపాక మరో షాక్: దీక్షకు డుమ్మా
దిశ అత్యాచారం, హత్య ఘటనపై పవన్ కల్యాణ్ వ్యక్తం చేసిన అభిప్రాయంతో ఆయన విభేదింతారు. దిశ కేసు నిందితులకు రెండు బెత్తం దెబ్బలు చాలు అని పవన్ కల్యాణ్ అనడాన్ని ఆయన వ్యతిరేకించారు.