జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే మధుసూదన గుప్తాకి బైండోవర్

By telugu news team  |  First Published Mar 14, 2020, 12:24 PM IST

కర్నూలు రోడ్డులోని బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన మధుసూదన్ గుప్తా ఈవీఎంను పగలగొట్టారు. అప్పుడు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.


జనసేన పార్టీ నాయకుడు, గంతకల్లు మాజీ ఎమ్మెల్యే కొట్రికె మధుసూదన గుప్తాను బైండోవర్ చేశారు. 21, 23న జరిగే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, ముందస్తు చర్యల్లో భాగంగా గుంతకల్లు మధుసూదన్ గుప్తాని శుక్రవారం పోలీసులు బైండోవర్ చేశారు.

Also Read ఏపీలో దారుణం: సరస్వతీదేవి, పొట్టి శ్రీరాములు విగ్రహాల ధ్వంసం...

Latest Videos

undefined

2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గుత్తి పట్టణం కర్నూలు రోడ్డులోని బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన మధుసూదన్ గుప్తా ఈవీఎంను పగలగొట్టారు. అప్పుడు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు గుత్తి పోలీసులు పాత కేసులో ఉన్న మాజీ ఎమ్మెల్యే  మధుసూదన్ ని బైండోవర్ చేశారు. కాగా.. తర్వాత రూ.లక్ష సొంత పూచీకత్తు తీసుకొని తహసీల్దార్ బ్రహ్మయ్య ఎదుట బైండోవర్ చేశారు.  కాగా, గత ఎన్నికలకు ముందు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్, ఆయన కుమారుడిని ఉద్దేశించి కూడా మధుసూదన గుప్తా తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. 

click me!