బిజీగా ఉన్నాను.. కోర్టుకు రాలేను.. సీఎం జగన్ రిక్వెస్ట్

Published : Mar 14, 2020, 10:31 AM IST
బిజీగా ఉన్నాను.. కోర్టుకు రాలేను.. సీఎం జగన్ రిక్వెస్ట్

సారాంశం

బిజీగా ఉండటం వల్ల వ్యక్తిగతంగా హాజరుకాలేకపోతున్నానని, మినహాయింపు ఇవ్వాలని జగన్ తన తరపు న్యాయవాది ద్వారా కోర్టుకు నివేదించారు. ఈ మేరకు దాఖలు చేసిన పిటిషన్ ను అనుమతించిన న్యాయమూర్తి.. తదుపరి విచారణను ఈ నెల 20 వతేదీకి వాయిదా వేశారు.

తాను ముఖ్యమంత్రి చాలా బిజీగా ఉన్నానని.. కోర్టుకు హాజరుకాలేకపోతున్నానంటూ సీఎం జగన్ న్యాయస్థానానికి రిక్వెస్ట్ చేసుకున్నారు. సీఎం జగన్ అక్రమాస్తుల కేసును సీబీఐ ప్రత్యేక కోర్టు విచారిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ కేసును న్యాయస్థానం ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. 

కాగా.. ఏపీ ముఖ్యమంత్రిగా అధికారిక విధుల్లో బిజీగా ఉండటం వల్ల వ్యక్తిగతంగా హాజరుకాలేకపోతున్నానని, మినహాయింపు ఇవ్వాలని జగన్ తన తరపు న్యాయవాది ద్వారా కోర్టుకు నివేదించారు. ఈ మేరకు దాఖలు చేసిన పిటిషన్ ను అనుమతించిన న్యాయమూర్తి.. తదుపరి విచారణను ఈ నెల 20 వతేదీకి వాయిదా వేశారు.

Also Read జగన్ ఆస్తుల కేసు... సీబీఐ కౌంటర్ లో విస్తుపోయే విషయాలు...

ఇదిలా ఉండగా.. ప్రైవేటు వ్యక్తుల పెట్టుబడులకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ నుంచి తన పేరును తొలగించాలని కోరుతూ జగన్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ ను న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ మధుసూదనరావు వివరించారు. జగన్‌ తరఫున న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. రాజకీయ కక్షతోనే జగన్‌పై ఈ కేసు నమోదైందని, కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకు రావడంతో ఆ పార్టీ నేతలు, టీడీపీ నేతలు జగన్‌పై హైకోర్టులో పిల్‌ దాఖలు చేసి సీబీఐ దర్యాప్తు కోరారని తెలిపారు. ఈ నేపథ్యంలో చార్జిషీట్‌ నుంచి జగన్‌ పేరును తొలగించాలని విజ్ఞపి చేశారు.

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan with “Tiger of Martial Arts” Title: టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు| Asianet Telugu
Raghurama krishnam raju: ఘట్టమనేని ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే RRR స్పీచ్| Asianet News Telugu