జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇవాళ రిషికొండ, ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించనున్నారు. విశాఖపట్టణం జిల్లాలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సాగుతున్న విషయం తెలిసిందే.
విశాఖపట్టణం: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రుషికొండ, ఎర్రమట్టి దిబ్బలను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు పరిశీలించనున్నారు.వారాహి యాత్రను పవన్ కళ్యాణ్ నిన్న విశాఖపట్టణంలో ప్రారంభించారు. విశాఖ పట్టణంలోని జగదాంబ సెంటర్ లో వారాహి యాత్రలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు.
ఇవాళ విశాఖపట్టణంలోని రిషికొండ, ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించాలని భావిస్తున్నారు.అయితే పవన్ కళ్యాణ్ పర్యటనకు పోలీసులు అనుమతిస్తారా అనేది ప్రస్తుతం చర్చకు దారితీసింది. గతంలో కూడ రిషికొండ పర్యటనకు పవన్ కళ్యాణ్ ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కు పోలీసులు ఆంక్షలు విధించారు. గత ఏడాది నవంబర్ మాసంలో పవన్ కళ్యాణ్ రిషికొండను సందర్శించిన విషయం తెలిసిందే.
విశాఖపట్టణానికి చెందిన పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ ఇవాళ సమావేశం కానున్నారు. ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో చర్చించనున్నారు. ఈ నెల 19వ తేదీ వరకు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలో సాగనుంది. విశాఖ జిల్లాలోని ప్రజల సమస్యలపై పవన్ కళ్యాణ్ కేంద్రీకరించనున్నారు.
also read:విధానం, సిద్దాంతం లేదు:పవన్ కళ్యాణ్ కు గుడివాడ అమర్‌నాథ్ కౌంటర్
వారాహి తొలి, మలి విడత యాత్రలు ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగింది. మూడో విడతను విశాఖపట్టణం జిల్లాలో సాగిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్టణం జిల్లాలో కూడ వైఎస్ఆర్సీపీ కి ఒక్క సీటు కూడ దక్కకుండా వ్యూహంతో ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ దిశగా పవన్ కళ్యాణ్ వ్యూహరచన చేస్తున్నారు